పుట:కాశీమజిలీకథలు -04.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

330

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

తెలియపరచితిని. ఇవియే జరిగిన విషయములు. మీలో నెవ్వనికిఁ బెండ్లి చేయవలయునో మీరె చెప్పుడు పండితులు వేరువేర యభిప్రాయములు పడిరని యుపన్యాసముగాఁ జెప్పెను.

అప్పుడు కళావంతుఁడు తనకే యక్కన్యం బెండ్లి చేయవలయునని యుక్తియుక్తముగా వాదించెను. వాని వచనంబులన్నియు ఖండించుచు వసుంధరుఁ డా సుందరిఁ దనకుఁ బెండ్లిచేయవలయునని కోరికొనియెను. ఇరువురి వాదమువిని యజ్జన పతి డోలాయతమనస్కుండై చేతులుజోడించి యిరువురు సమాధానపడి యొకతెరు వెఱిగింపుఁడని మిక్కిలి వినయముతోఁ బ్రార్ధించిన వసుంధరుం డిట్లనియె.

నరేంద్రా ! యిప్పటిరాజులలోఁ గృష్ణదేవరాయలు పెక్కండ్ర బండితులం బ్రోగుచేసుకొని యాదరింపుచున్నాఁడు. తదాస్థాన పండితులకే దిగ్దంతులని బిరుదములు గలిగియున్నవి. ఇప్పుడీ విషయము లన్నియుఁ బత్రికలో వ్రాసి యా నృపాలు నొద్ద కనుపుము. మేమునుఁ బోయి యా పండితులలో వాదింతుము మా వాదములు విని యందలి పండితు లేది నిర్ధారణ చేయుదురో యట్లు కావింతువు గాక అందులకు మేమిరువురము నొడంబడుచున్నా రమని పలికిన సంతసించుచు నప్పుడే యా విషయము లన్నియు బండితులచేత వ్రాయించి యుత్తరముతో గూడ రాయలవారి యాస్థానమునకు బంపెను.

అందు వసుంధరుండు తన పేరు దేపగుప్తుడనియుఁ గళావతి పేరు కళావంతుడనియు వ్రాయించెను. వారి రాజఁ జారుల వలన విని కృష్ణదేవరాయలు మిగుల సంతసించుచుఁ బూవుఁతోటలో నున్న చిత్రశాలలో వారిం బ్రవేశపెట్టించి యుపచారములఁ గావింప దాయాదుల బెక్కండ్ర నియమించి -------- పండితులకుఁ దెలియజేసెను. దేవగుప్తుని పేరు వినినంతనే --------------- కవీశ్వరుడు నాఁడు రాయలవారు పంపిన పత్రికలం జదువుకొని విచారించుచు నందఱు గుమిగూడి రామలింగకవి యింటికిజని యతనిచేత సత్కృతులై యిట్లనిరి.

ఆర్యా ! మనకు హృదయకూలమయిన దేవగుప్తుఁడు వచ్చిన వార్తనీకునుం దెలిసియే యుండును. నాఁటి యవమాన మెట్లో దాటించితివి. వాని వలన మన సామర్థ్యము దెలిసికొనవలయునని రాయలవారు గట్టిశ్రద్ధ చేయుచున్నారు. మొన్నటి వలెనే - పే, జతం, నేల, సరం. మనం సిరా నలు ముసు.. మన కంతకంటె యపఖ్యాతియేమున్నది ! సభ కూడకమున్న దానికుపాయ మేదియేని