పుట:కాశీమజిలీకథలు -04.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

42]

కళావతీసుందరుల కథ

329

ద్వితీ - ప్రకటన పత్రికలో నిట్టివిషయమేమియు వ్రాయఁబడి యుండలేదు. గెలిచినవాని కప్పుడే పదివేలమాడలు కానుకగానిచ్చివేసిరి. అప్పుడైనం జెప్ప లేదు. తరువాత నెప్పుడో వ్రాసిన యుత్తరము ప్రధానముకాదు. తండ్రిచే నిరూపింప బడిన వరుడే యర్హుఁడని రెండవ తెగవారు చెప్పిరి.

ప్రథ - నీకేది యుక్తమని తోచెడిని.

తృతీ - ద్రౌపదిలాగున నమ్మగువ యిరువురం బెండ్లియాడిన యుక్తంగా నుండునని నా యభిప్రాయము.

ప్రథ - నిన్ను రాజుగారు కోరునప్పు డట్లె చెప్పుదువుగానిలే.

తృతీ - అట్లే చెప్పెదను. నాకేమియు భయములేదు. కాకున్న స్త్రీల కట్టి స్వతంత్ర మిచ్చినందులకు రాజుదే తప్పు.

ప్రథ – గొడ్డువీగి కనినబిడ్డకావున నామెకోరినట్టు చేయించెను. పోనిమ్ము మిత్రమా తరువాత నేది నిర్ధారణచేసిరో చెప్పుము.

ద్వితీ - ఏది నిశ్చయింపలేదు. వారిరువురను రప్పించి వారెట్లు చెప్పిన నట్లుచేయుట యుచితమని నిశ్చయించి యంతటితో సభ చాలించిరి.

తృతీ - ఇద్దరు కావలయునని కోరిన నేమిసేయుదురో ? సిరికా మోకాలడ్డువాడుండునా యేమి ? రాజ్యముతోఁగూడ నా చేడియ దక్కుచున్నదిగదా.

ప్రథ -- అప్పుడు నీవు చెప్పినట్లే చేయుదురేమో ?

ద్వితీ - అదియుం జూతముగా తొందరయేల?

అనిమాట్లాడుకొనుచు వారు నిష్క్రమించిరి.

ఆ సంవాదమంతయు విని నవ్వుకొనుచు వారిలో వారేదియో మాట్లాడికొని యా రాత్రి బసలోనికిం బోయి పండుకొనిరి. అమ్మఱునాడు ప్రాతఃకాలమున నా భూపాలుండు వెండియు సభజేసి యా సభకు వారిరువురను రప్పింది. మహోన్నత కనకపీఠంబులం గూర్చుండఁబెట్టి స్పౌమ్యులారా ! మీరిరువురును పండితులగుచో నా విన్నపం నొక్కటాలింపవలయును. మా కౌముది పత్రికలోఁ బ్రకటించిన విషయములు మీరు చూచియేయున్నారు. తరువాత నితం డోడించెను. ------------- బ్రకటించిన ప్రకారము కానుక నిచ్చితిమి. తరువాత