పుట:కాశీమజిలీకథలు -04.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళావతీసుందరుల కథ

327

గీ. సాటిలేనిమేటి • చక్కఁదనము గల్గి
    సకల విద్యలందు . జాణలగుచు
    నేకదేశమున వ. సెంచెడు యువజవ
    లొకరినొకరు వలచు • టొక్క యరుదె.

అతండు డెందంబునఁ బొడమిన వికారంబుఁ దెలియనీయక యడఁచుకొని బాలా ! మనమెప్పుడు కుముద్వతీ నగరంబున కరుగువము. ఆ చంచలాక్షి యెవ్వరిని వరించునో యా నృపాలుం డెవ్వరికిచ్చి పెండ్లి సేయునో యేమివింతలు జరుగునో చూతముగాక యని పలికిన విని యక్కలికియు సమ్మతించినది.

పిమ్మట సదాచారి యనుసరించిరా వారిరువురు గతిపయ ప్రయాణంబుల నప్పుటభేదనంబు చేరి దూతలవలనఁ దమరాక నృపాలున కెరింగించిరి. ఆ భూభర్త యా వార్తవిని సంతసముతో వారిని విచిత్ర సౌధంబున విడియఁజేసి యుపచారములుఁ గావింపఁ బెక్కండ్రఁ బరిచారకుల నియమించెను. ఊరి చేరినది మొదలు సదాచారి కళావంతుని దనసొమ్మిపింపుమని నిర్బంధింపఁ దొడంగినవిని దేవగుప్తుండు తాతా ! నీ వెక్కడికిఁ బోయెదవు ? నీవు రాజుతో వియ్యమందవలయును. నీ కుమారునికి రాజపుత్రికనిచ్చి వివాహము చేయుదురఁట వస్తువులు పెట్టవలయును సొమ్మేమైన దాచితివేమో తెమ్మని పలికినవిని యా పాఱుండేమియు మాటాడక యవ్వలికిం బోయెను. మఱియు నాఱేయి వసుంధరుఁడును గళావంతుడును పురీవిశేషములరయఁ దిరుగుచు నొకదేవాలయము దాపునఁ బౌరులు గొందఱు మాటలాడుకొనుచుండ నందు నిలువంబడిన వారిట్టు మాట్లాడికొనిరి.

పథముడు - మిత్రమా ! సభావిశేషములేమి ? చివరకు గౌదమి నెవ్వరి కిచ్చుట నిర్ధారణచేసిరి ? నీవు చివరంట నుండితివిగదా ?

ద్వితీయుడు - మొదటివానికి పెండ్లి చేయవలయునని కొందఱు, రెండవ వానికిఁ జేయుట నీతియని కొందఱు వాదించిరి.

తృతీయుఁడు -- మీ మాటలేమియు నాకుఁ దెలియుటలేదు. తత్పూర్వోత్తర మేమియో వివరింపుడు.

ప్రథ - మన రాజుగారి కూఁతురు కౌముదిమాట జెప్పికొనుచున్నాము. ఆ చిన్నది తనతోఁ జదరంగమాడి జయించినవానిం బెండ్లియాడుదునని నిశ్చయము చేసికొన్నఁదట.