పుట:కాశీమజిలీకథలు -04.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష్ణుగుప్తుని కథ

325

అయ్యా ! యీదేవగుప్తుండు పాండ్యదేశాధీశ్వరుండయిన మలయధ్వజు మహారాజుగారి యాస్థానపండితుండు. ఆ నృపతి వలనఁ బెక్కు బిరుదములతో నీయగ్రహారము గానుకగాఁ బడసెను. ఇప్పుడాఱేని సభగు రాయలవారి యస్థాన కపులు దిగ్దంతులని బిరుదములు వహించిన వారు వచ్చిరఁట వారితోఁ బ్రసంగింప రమ్మని యింతకు ముందే యభూపతి పత్రిక నంపెను. ప్రసంగ సంగరములో వారిం బరాజితులఁ గావించి మాదివాణము ఖ్యాతినిగానక పోయితివేని నీ యగ్రహారము లాగికొని వారికిచ్చి వేయుదుమమని యా పత్రికలో వ్రాయబడి యున్నదఁట. ఇతండు వారి పాండిత్య మగ్గడించుకొని వెఱచుచు నగ్రహారము పోవునని పరితపించుచున్న వాఁడు ఇదియే భోజనము సేయని కారణమని యతఁడు నాకుఁ చెప్పెను.

విష్ణుగుప్తుండు ధర్మశీలుఁడని వినియుంటిని కావున నతనింగావఁదలంచి యాలోపలికింబోయి యతడినిం గాంచి యార్యా ! నీవు రాయలవారి పండితులకు వెఱచి భోజనము సేయమానివేసితివఁట కాదా ? అయ్యయ్యో ! ఇంత యనుచిత మేదియేనింగలదా ? వారితో వాదింప సామర్థ్యము లేకపోయిన మఱియొక తెరువాలోచించు కొనవలయుంగాని యూరక పరితపించిన లాభమేమియున్నది ! లెమ్ము . భోజునము సేయుము. నీకు బదులుగా నేనుబోయి వాదించి వారిం బరాజితులఁ గావించెద నిప్పుడే కాశిలో సకల విద్యల జదువుకొని వచ్చుచుంటి. ప్రసంగ మెచ్చటనైన జరుగునాయని వేడుక జెందుచుంటి. నీ యగ్రహారము నిలిపెదనని పలుకుటయు విని దాతహప్తుండంబుదనినదంబునోలె నామాటవిని యతండత్యంత సంతోషము జెందుచు మంచము దిగి నన్ను జూచి వెఱగందుచు నిట్లనియె.

అయ్యా ! నీ పేరేమి ? ఎందుండి వచ్చుచుంటివి ? జన్మభూమి యెచ్చట? నీవు బాలుండవే ? యా ఫ్రౌడులతోఁ బ్రసంగింపఁగలవా ! వారి వృత్తాంత మెఱుంగవు వారు సామాన్యులుకారు అందు రామలింగకవి యున్న వాఁడు అతని చెయువులు కథలుగాఁ జెప్పుకొనుచుందురు. నీ సామర్థ్యము దెలియువరకు నా మనస్సంతాపము వాయదని పలికిన నేనిట్లంటి ఆర్యా : నా పేరు దేవగుప్తుండందురు నా జన్మభూమి మళయాళ దేశములో నొక గ్రామము. కాశినుండి చదువుకొని వచ్చుచున్నాను. ఆ పండితులు నే నెఱుంగనివారుకారు వారిం గెలువగలను వెఱపుడుగుము. భుజింపుమని యతండు నమ్మునట్లు చెప్పితి నప్పుడతం డయ్యా ! నీ దేజము చూడ నంతవాఁడవు పలెఁ దోచుచున్నది. కాని నీ విజయమువలన నాకేమి ప్రయోజనమని యడిగిన విని నేనాలోచించి నీ కుమారుండననిపోయి బ్రసంగించెదఁ బుత్రుని పాండిత్య ప్రకర్షము