పుట:కాశీమజిలీకథలు -04.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌముది కథ

323

పంపుచుండును. మేమేమి చేయుదము ! నిన్నెన్నిసారులు శ్రమపెట్టుదుము ? వేరొక యుపాయ మేదియుఁ దోచకున్నదని పలికి రాజు పంపిన యుత్తరము చూపెను.

మా మిత్రులు పాండ్యదేశాధీశ్వరులు వ్రాయించిన యుత్తరము చూచికొని మిక్కిలి యానందించితిమి. మాపండితు లీనడుమ దిగ్విజయము చేసికొని వచ్చిన మాట యధార్థమే కాని మీ పట్టణమునకు పోలేదని చెప్పుచున్నారు. ఏది యెట్లయినను మీ బాల పండితుని పాండిత్య ప్రకర్షము చూడ మిగల వేడుకగా నున్నది. మా విద్వాంసులు తిరిగితిరిగి యలసి వచ్చిరి. కావున వెండియు వారికి పయనము సెప్పుటకు సంశయించుచున్నాడ. మీ బాల విద్వాంసు నొకసారి యిక్కడకు బంపితిరేని తప్ప్రగల్బోపన్యాస శ్రవణంబున శ్రవణానందంబుఁ గావించు కొనియెదను. వారి రాకపోకలయిన విత్తమును సమర్పణ చేసికొనుచున్నాడ. ఇట్లు కృష్ణదేవరాయలు. అనియున్న యుత్తరము రెండవ ప్రక్కను ఇప్పుడు మీకుమారుని రాయలయొద్ద కనుపవలసియున్నది. తక్షణమె యిక్కడకే పంపవలయునని మలయధ్వజుఁడు వ్రాసెను.

ఆ జాబుఁ చదివికాని దేవగుప్తుండు ఆర్యా : నేనిప్పుడు కుముద్వతి కరిగి యచ్చటినుండి విజయనగరమునకుంబోయి రాయలవారి పండితులతోఁ బ్రసంగించెద. ఆ మాటనీవు మలయధ్వజునొద్దకరిగి చెప్పుమని చెప్పవలసిన మాటలన్నియు బోధించి విష్ణుగుప్తుననిపెను.

ఆ ప్రసంగ మంతయు విని కళావంతుండు స్వగతంబున సందియ మందుచు విలాసముగా దేవగుప్తుని కిట్లనియెను. నీవీ విష్ణుగుప్తుని కుమారుండవు కానియట్లు తెల్ల మైనది. ప్రచ్ఛన్నముగాఁ దిరుగుటకుఁ గారణమేమియో తెలియదు. నీకులకీల నామంబులు వివరించి నాకు శ్రోత్రానందము గావింపుము. సఖ్యము ------------ గదా ?నేను నీకు శిష్యుండ భృత్యుండ నాప్తుండ నగుట నిక్కము వక్కాణింప నర్హుండనని పలికిన విని నవ్వుచు నతండిట్లనియె. నీవును సదాచారి ---------------- కాని యటుల నాకునుఁ దెల్లమయినది. నీ యుదాంతము ముందు జెప్పితివని ------------ నాకథఁ జెప్పెదనని నుడివిన నక్కపట కళావంతుఁడు మలదిసి ---------------- వదనా లంకార మగుచుండ నార్యా ! నీవు మందారవల్లి కొడుకువయినచో నావృత్తాంతము చెప్పెదనని యుత్తరము చెప్పెను.