పుట:కాశీమజిలీకథలు -04.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

322

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వేగవచ్చి రాజశ్రీ యుక్తముగా మదీయ పాణిగ్రహణముగావింపుము. అని కళావంతునకు రాజపుత్రిక వ్రాసినది. ఆ యుత్తరములను చదివికొని వారు మందహాసశోభిత వదనారవిందులైరి. అప్పుడు తన యుత్తరము చూడుమని దేవగుప్తున కిచ్చినంత నతండును దన యుత్తర మా కళావంతున కిచ్చె.

దేవగుప్తుండు కళావంతుని యుత్తరము చదివి వయస్యా ! వీరి సందేశములు మిగుల చిత్రములుగా నున్నయవి. ఒండొరుల యభిప్రాయములు తెలియక నిట్లువ్రాసిరని తలంచెదను. ఎట్ల యినను దొలుతగన్యచే వరింపఁబడినవాఁడవు నీవుగదా ? 'పూర్వ త్రాసిద్ధం' అను సూత్రార్ధము ననుసరించి నీకేయెక్కుడు బలము గలిగి యున్నది. కావున వేగఁబోయి యాయింతిం బెండ్లి యాడుమని చెప్పినఁ గళావంతుండు అట్లుకాదు దేయము దాతృవశం బయియుండును. అట్టిదాత నీకిత్తునని యుత్తరం వ్రాసెంగదా ? మఱియు 'నరనిత్యాంతరంగాపవాచానా ముత్తరోత్తరం బలీయః' అని కౌముదియే చెప్పుచున్నది. కావున మీరే యానారీమణిం బరిగ్రహింప నర్హులని పలికెను. అని వారిరువురు బరిహాసముగా మాట్లాడికొనుచున్న సమయంబున సదాచారి విచారముతో నరుదెంచుటయుం జూచి యతనితో మాటలాడుటకుఁ గళావంతుఁడు కొంచెము చాటుగాఁబోయెను. అప్పుడా విప్రుండు యువతీ ! నాగ్రహచారము మంచిది కాదు. చేతికి దొరకిన సొమ్మువిడచి పేరాసఁబడి యిడుమలం గుడుచుచున్న వాఁడ. నీవువచ్చినంగాని యాసొమ్ము నాకీయరఁట. నిన్నుఁ దీసికొనిరమ్మన్నారు. ఆలుబిడ్డల విడిచి యెంత కాలమిట్లు తిరుగుచుందసు ? వేగవచ్చి యా సొమ్మిప్పింతువా ? పొమ్మందువా ? యని యడిగిన నతం డిట్లనియె.

తాతా ! మెల్ల గా మాటాడుము నేనువచ్చి సొమ్మిప్పించెద. విచారింపకుము. ఇప్పుడిక్కడిక్కడే పయనమగు చుందుమని యదార్చెను. వారి సంవాదము దేవగుప్తునికి వినంబడినది. తరువాతఁ గళావంతు డీవలకువచ్చి ఆర్యా ! మనమెట్లైనఁ గుముద్వతి కరుగ వలసియున్నది. అక్కడకిబోయి యా చమత్కార మేదియో చూతముగాక యని పలికిన నతండును సమ్మతించెను. ఇరువురు నమ్మఱునాఁడు విష్ణుగుప్తునకుం జెప్పి కుముద్వ కరుగుటకు బయలుదేరి క్రోశదూరము పోయిరో లేదో విష్ణుగుప్తుడు పిరుందన పరుగెత్తికొనిపోయి వారింగాంచి సంతసించుచు నిట్టూరుపులతో దేవగుప్తా ! నీవు మాపాలిటికి దైవమువై యాపదలు తొలగించుచుంటివి. నిన్ను నాకుమారుడని చెప్పుకొనుటచే మలయధ్వజుం డెప్పటికిప్పుడే రమ్మని వర్తమానము