పుట:కాశీమజిలీకథలు -04.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కౌముది కథ

319

దనయింటికింబోయెను. అని యెఱింగించి మణిసిద్ధుండు తదనంతరోదంతం బవ్వలి మజికీయం దిట్లని చెప్పందొడంగెను.

నలువది యేడవ మజిలీ

కౌముది కథ

గోపా : వినుమొకనాఁడు కుముద్వంతుని కూఁతురు కౌముది యంతఃపురమున సఖులతో నిట్లు వితర్కించినది.

కౌముది – ప్రజ్ఞావతీ ! కళావంతున కాయుత్తరమిచ్చి వచ్చితివా ?

ప్రజ్ఞావతి - నీవు చెప్పినప్పుడే యిచ్చి వచ్చితినికాదా ?

కౌ - ఆయుత్తరము జూచికొని యతం డేమనెను ?

ప్ర - మందహాసము గావించి సంతసించితిమని చెప్పుమనియె.

కౌ - అతండనుకూలుండని నీకు దోచినదా ? నవ్వుచున్నా వేమి ?

ప్ర - వానివలచియే యాటఁ గట్టించుకొంటివాయేమి ?

కౌ — అమ్మక చెల్లా ? వానిబుద్ధికౌశల మేమని వక్కాణింతును అప్పుడీసుచే నేమాటయుఁ బలికితినికాను.

ప్ర - ఎట్లయినను దనకన్న చిన్నవానిం బెండ్లియాడుట లోకవిరుద్ధమగు నని నవ్వుచున్నాను.

కౌ - అందులకు నవ్వనక్కరలేదు క్షత్రియులకదియాచారమే. శ్రీరాముని కన్న సీత యెన్నియేండ్లు పెద్దదియో యెఱుంగుదువా ?

ప్ర - లెస్సయేకాని మఱియొక వదంతి వింటి నది నీ మనోరధమునకు నిరోధకమని తలంచుచున్న దాన.

కౌ - అదియేమియో చెప్పుము.

ప్ర - ఏనుఁగబారిందప్పించి నిన్నుఁ గాపాడిన విప్రకుమారునకుఁ బెండ్లి చేయవలయునని మీతండ్రి తలంచుచున్నట్లు కింవదంతి పుట్టినది.

కౌ - చాలుచాలు భూమిలో, హారములో, నగ్రహారములో కాక యంత మాత్రమునకే మా తండ్రి నన్ను వానికిఁ బెండ్లిచేయుటకు సమ్మతించునా ? ఆవదంతి వట్టిది.

ప్ర - కళావంతునేమి చూచి వరించితివి ?

కౌ -- అదియా ? మేలు మేలు వాని విద్య యొక్కటిచాలదా ! -------------- ప్రతియున్నదా ! అంతకన్నఁ గావలసినది యేమున్నది.

ప్ర - నేను వానింజూడలేదు కాని వాఁడును ----------------------- మన ప్రజ్ఞావతి యంతయు నెఱుంగును.