పుట:కాశీమజిలీకథలు -04.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మఱియు సాధ్యసవికలమతియై యొడలెఱుంగక వివశయైయున్న కౌముది నూరడించుచు వేరొక యందలమును దెప్పించి యందమ్మందయానం గూర్చుండఁబెట్టి యంతఃపురమున కనిపెను. అప్పుడా ధోరణులు పెక్కండ్రువచ్చి యవ్వారణమును బుటునిగళంబులంగట్టి తీసికొనిపోయిరి. తరువాత నా భూతలనేత నా విప్రకుమారుని ప్రభావము పెక్కు తెఱంగులఁ గైవారము జేయుచు నతని నొక యందలముపై నెక్కించి యూరేగించి విహారసౌధములోఁ ప్రవేశ పెట్టించి యుపచారంబులం జేయ బెక్కండ్ర పరిచారకుల నియమించెను. ఇంతవట్టు కథ నిన్న జరిగినది. ఆ చిన్నవానికిఁ బదియాఱేడుల ప్రాయము గలిగియున్నది. వాని పేరు దేవగుప్తుండని చెప్పినట్లె జ్ఞాపకము. తక్కిన లక్షణములన్నియు మీరు నుడివినట్లున్నదని యా వృత్తాంతమంతయు జెప్పెను.

ఆ వృత్తాంతము విని విష్ణుగుప్తుండు మిగుల సంతసించుచు మఱునాఁడు ప్రొద్దునలేచి యడిగి తెలిసికొని విహారసౌధమునకుఁ బోయి యందు దేవగుప్తుఁడను చిన్న వాఁడున్నవాడా ? యని యందలివారల నడిగిన వారిట్లనిరి. అయ్యా ! దేవగుప్తుడు మా రాజపుత్రిక నాపత్సముద్రంబునుండి లేవనెత్తి నిన్నటివఱకు నిందే యుండెను. నిన్న నెవ్వరో కళావంతుడను విద్వాంసుఁడు జదరంగమాడి యోడించిన వృత్తాంతము చెప్పుచు నిప్పుడతండు మలయధ్వజుని యాస్థాన పండితులతో బ్రసంగింప నరిగేనని యెఱింగింపఁ దొందర పడుచుఁ గరికలభంబుమీఁది కుఱికెడు సింహ పోతంబు చందమున నందు నిలువక హుటాహుటి పయనంబుల నతండా ప్రోలి కరిగెనని యా వృత్తాంతము జెప్పిరి.

ఆ కథవిని విష్ణుగుప్తుండు పరమానందము జెందుచున్నందువెడలి కొన్ని దినంబులకుఁ దానుగూడ మధురాపురమునకుం బోయెను. అందు గొందఱు విహితు లెదురఁబడుటయు నతండు మిత్రులారా ! ఇచ్చటికి దేవగుప్తుండు వచ్చెనా ! సభజరిగినదా ? విశేషములేమని యడిగిన వారిట్లనిరి. విష్ణుగుప్తుండును గళావంతుఁడునుజక్కగాఁ బ్రసంగించిరి కుశలవులవలె నొప్పుచున్న యా విప్రకూమారుల నిరువురంజూచి సభ్యులు మిక్కిలి యక్కజమందజొచ్చిరి. వారిరువురు మూడుదినములు సకల విద్యల యందును హోరాహోరీగాఁ బ్రసంగించిరి, మూఁడవనాఁడు దేవగుప్తుఁడు కళావంతుని దాసోహమనిపించి పందెమును గెలిచెను. కళావంతుఁడు దేవగుప్తుని బృహస్పతియని యా సభలో స్తుతిఁజేసెను.

అప్పుడందఱు దేవగుప్తునిపైఁ బుష్పవర్షము గురిపించిరి. మనరాజుగారు మూఁడు గ్రామములను దానపట్టమువ్రాసి దేవగుప్తునకిచ్చిరి. కళావంతుఁడు దేవగుప్తు నాశ్రయించి తిరుగుచుండెను. నిన్ననే యిరువురును గలిసి మీ యగ్రహారమున కరిగిరని చెప్పిన విని విష్ణుగుప్తుండు సంతోష పారావారావీచికలం దేలుచు నతిరయంబునఁ