పుట:కాశీమజిలీకథలు -04.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

35

మల్లిక - మాలోఁ బ్రాయము వచ్చువరకే స్త్రీలు విద్యాభ్యాసము చేయుదురు. నేను నంతవఱకు కొంతకొంత చదివితిని.

లవంగి — ఏ విద్యయందుఁ బరిశ్రమచేసితివి ?

మల్లిక - ఇదియదియని చెప్పలేను.

లవంగి - వ్యాకరణ మేమైనం జూచితివా ?

మల్లిక - అదియుం దెలియకపోవలయునా ?

లవంగి - తర్కమో ?

మల్లిక - తర్కము జదివినంతనే యయ్యెనా యేమి ?

లవంగి - వేదమో ?

మల్లిక - బ్రాహ్మణులకు వేదముఁ జదువుటయు నొక యబ్బురమే ?

లవంగి — వేదార్ధ మెఱింగితివా ?

మల్లిక – అర్థము తెలియనిదే వేదము వచ్చునని మాలోఁ జెపుకొనరుగదా. అంగసహితముగాఁ జదివినప్పుడే వేదము తెలియునని చెప్పుకొనవలయును.

లవంగి -- ఈ విద్య లన్నియు నీవు ప్రాయము వచ్చులోపలనే చదివితివా?

మల్లిక - పదఁతీ! ఇట్లడుగుచుంటివేమి? ఈ విద్యలు ప్రాయము వచ్చువఱకుఁ జదువవలయునా? నా బుద్ధిమాంద్యతకుఁ బరిహాసమాడుచుంటివికాబోలు. వినుము. నే నివి ప్రత్యేకముగాఁ జదువలేదు. మా యన్నగారు చదువుచుండ నేనప్పుడప్పుడు విని గ్రహించితిని.

లవంగి - మీ యన్నగా రెన్ని సంవత్సరములు జదివిరి?

మల్లిక - అస్త్రవిద్యాపరిశ్రమయం దెక్కుడు వేడుక కలుగుటచే నతండీ విద్యలఁ బూర్తిచేయుటకు నాలుగైదు సంవత్సరములు పట్టినది. రాత్రులందుమాత్రమే చదువువాడు.

లవంగి -- (కుందలతిలకవంకఁ జూచుచు) సఖీ! ఈమె మాటలు వింటివా? అబ్బురముగాఁ జెప్పుచున్నది.

కుం - నీకీ సందియ మేమిటికి? ప్రశంసించిచూడుము.

మల్లిక – తప్పక ప్రశంసింపవలసినదే. నాకును ముచ్చటగానే యున్నది.

లవంగి - (పదునాలుగు విద్యలలో స్థాలీపులాకన్యాయముగా నడిగి తగు నుత్తరములు వడసి యచ్చెరువందుచు) కుందలతిలకా ? ఈ సుందరి పలుకువెలందియని చెప్పఁదగినదిసుమీ. ఓహో ! మోహనాంగీ! నీవే యింత ప్రోడవై యుంటివి. మీ యన్నగారెంతవాఁడోగదా.

మల్లిక - సుందరీ! నిందా గర్భస్తుతివచనములనే మమ్ము నేమిటి కెత్తి