పుట:కాశీమజిలీకథలు -04.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

38]

శతానందయోగి కథ

297

చున్నాడు. వినుండు పొడమినది మొదలు నేఁటిదనుక నిడుములం గుడిచి కుడిచి నా బొందె చిట్టము గట్టినది. వనిలాసులం బించుకయుఁ జవిచూచి యెఱుఁగుదును గదా ! సంకల్ప శతములతోడనే కాలము సగము గడిచినది. పుట్టు బ్రహ్మచారినై యిట్లుంటి దొంటి పుట్టువున నెప్పుడో కొంచెము సుకృతము గావించితిని గాఁబోలు మీ దర్శన లాభము గలిగినది. ఇఁకనాకు జేయవలసిన పని యేమియును లేదు. మీ యంతేవాసి కాయక్షిణీ మంత్రముపదేశము సేయుఁడు. అగ్గిరి కరిగి నలువదియేండ్ల దేవత నారాధించెదను. అక్కన్ని యు ప్రసన్నయై మీకుఁబోలె నభీష్టంబులఁ దీర్చినఁ దీర్చుకాక లేకున్న మృతినొందించుఁగాక యంతకన్న వేరొక దారిలేదు. అట్లు చేయకపోతిరేని మీ మ్రోల నిప్పుడే ప్రాణంబుల విడుచువాఁడనని పలుకుచుఁ బాదంబులంబడి లేచితిని కాను.

అయ్యతి నన్ను లేవనెత్తి చిఱునగవుతో తుందిలా ! అమ్మంత్రోపాసన సామాన్యమనుకొంటివా ? వినుము విద్యున్మాలఁ చంద్రలేఖ, సులోచన, యనియక్షిణీ దేవతలు మూఁడు తెరంగులఁ బొలు పొందుచుందురు అందు విద్యున్మాలను బది యేండ్లు చంద్రలేఖ నిరువది యేండ్లు సులోచనను నలువది యేండ్లును ఊపాసింప వలయును. చంద్రలేఖా సులోచనోపాసకులు పుడమి నెక్కడనోకాని లేరు. విద్యున్మాల నుపాసించనవా రద్భుత క్రియలఁ గావించుటయే కాని యిట్టి యభీష్టంబులం బొందలేరు. అదియునుంగాక యా యక్షిణీశైలమునకుం బోవుటయే దుర్ఘటము. అందు యక్షిణీదేవతలు క్రూరమృగ స్వరూపముగా వచ్చి యక్కొండశిఖర మెక్క నీయరు నీ వీ శ్రమ యెక్కడపడగలవు. నలువదియేండ్లు కందమూలంబులందినుచు నందామంత్రానుష్టాన మెట్లు చేయఁగలవు ? సుఖంబుగా నిందుండుమని చెప్పిన నేనిట్లంటిని.

స్వామీ ! యెన్నియేండ్లు తపంబుజేసిన నేమి యెంతశ్రమ పడిననేమి. అట్టి వన్నె కాడితో నొకఱేయిఁ గ్రీడించినం జాలదా ? యావజ్జీవము తపంబు గావించి యాయించుబోడిని వశపరచుకొనియెదఁ గనికరించి నాకామంత్ర ముపదేశముగావింపుఁ డని ప్రార్థించిననప్పారికాంక్షి సమ్మతించి శుభముహూర్తంబున సాంగముగా నాకమ్మంత్రోపదేశము గావించెను.

ఉపచార పరిగ్రహ మూరకపోవునా మఱియు నత్తపసి 1 1. 0 వచ్చి యిది నీ చెంత నుంచుకొని యయ్యచం: బునకుం 23-మ్ముడు... తన ములు నన్ను దాధింపవు. అయ్యషణ్ శైల కూటం. క0 3'0'. ఉన్న డి. దాని కసతిదూగములో య. ఈము లయ సంకలి సంక సంథం ఇనం సూర్పు, . ... మను న నప్పుడే ఆరు.. ఆ హానట్లు