పుట:కాశీమజిలీకథలు -04.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పిమ్మట నమ్మునితిలకుని యనుమతి వడసి శుభముహుర్తంబున బయలు వెడలి తదుక్త్ర ప్రకారం బీగిరి శిఖరంబున కేయంతరాయముం గానక యరుదెంచి జటావల్కలము ధరించి నాటం గోలెనిందా యక్షిణీమంత్రానుష్ఠానము గావింపుచుంటి. నిప్పటికి బదిదినములు కొఱఁతగా ముప్పదిసంవత్సరములై నది. ఇఁక పదియేఁడులు గడుపవలయు నిదియే మదీయ వృత్తాంతమని యతం డించుకయేనిఁ దాచక తన కథ యంతయుం జెప్పెను.

ఆ యుదంతము విని వసుంధరుఁడు ఇసిరో ? వీరెంత మూర్ఖులో కదా ! జీవితకాలమంతయు శ్రమపడి క్షుద్రసుఖంబు గోరుచున్నారు. కై వల్యమున నీ పాటి యానందము లేదు గాఁబోలు అక్కటా ? వైరాగ్య పవృత్తి యెఱుఁగరుగదా యని తలంచుచు నతని కథ కనుమోదించు వాడుంబోలె నభినయించుచు నయ్యక్షిణీ దేవాలయ మెందున్నదో నాకు జూపితిరికారేమని యడిగెను.

ఆ తుందిలుఁడు వసుంధరా ! నేను బ్రతిదినము వేకువజామునలేచి యక్కడికే కాదా పోవుచుంటిని. అందు మధ్యాహ్నము దనుక జపంబు జేసికొని వెండియు స్నానము జేసి పర్ణ శాలకు వచ్చి కుడుచుచుందును. నీకు జూపెద రేపునాతో రమ్మని చెప్పి యమ్మఱునాడు వాని నా దేశమునకుఁ దీసికొనిపోయెను.

తుందిలుఁడు జపము జేసికొనుచున్న సమయంబున పసుంధరుఁ డచ్చటి విశేషములన్నియుం జూచుచు శతానందయోగి యెరింగించిన స్తటి స్తంభము నందలి శిలాఫలకము గనంబడుటయు నందలి లిపి యంతయుం జదివికొని తాత్పర్యము జేసి కొనియెను.

యక్షిణిదేవి కథ

అందు సులోచనావశ్య విషయమై కొన్ని నిబంధనములు వ్రాయబడి యున్నవి. మొదటిది నలుబదియేండ్లు కందమూలములం దినుచుఁదన్మంత్రానుష్ఠానము చేసిన వశ్యమగును. రెండవది ముప్పదియేండ్లు మంత్రానుష్ఠానము చేసి పదునాలు గేఁడుల ప్రాయము గల విప్రకుమారు బలియిచ్చిన వశ్యమగును.

మూఁడవది ముప్పదియేండ్లు తన్మంత్రానుష్ఠానము గావించిన వాని బలి యిచ్చిన సద్యోవస్యము మరియు ననేక బంధములున్నవి. వానిలో రెండవ నిబంధనము దాపున గురుతుం గలిగియున్నది. మూఁడవ నిబంధనము దెలియకుండ మట్టి పూయఁబడియున్నది. పసరు వ్రాసి చదివెను కావున వానికాలిపితెల్లమైనది. రామలింగకవి పుత్రుఁ డాగురుతులు గ్రహించి యౌరా ! ఈ సన్యాసి నన్ను బలియియ్య వలయునని తలంచి కాఁబోలు నిందుగురుతు వెట్టియుండెను ? నేనది జూచి తన్ను పరియునని తలం, పాలు నలదు ఎందుకు మును? నేసవి మచి తన్ను బలియిత్తునని వెఱచి యీ లిపి కప్పిపుచ్చెను. సీ ! తుచ్ఛసంపదల కాసపడి నేనట్టి పని చేయుదునా నన్ను జంపఁ బ్రయత్నించెనేని గడతేర్చక మానను. దానబాతకము