పుట:కాశీమజిలీకథలు -04.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చూపు చెందెను. ఓహో హో యని మెచ్చుకొనుచు నమ్మచ్చకంటి చక్కందనముఱెప్ప లార్పక చూచుచు నంతలో మోహ మావేశింప నొడ లెఱుంగక వివశుండనై పడి మఱునాఁడు లేచి యెప్పటి విషయంబులం జూచితిని.

మఱియు నట్లాఱువారములు తప్పక మేల్కొని వారిక్రీడా విశేషంబులఁ జూచితిని. అప్పుడు నాకు మదవోన్మాదము జనించినది. కన్నులకు గట్టినట్లాయన్నుల మిన్నయే యెల్లప్పుడు కనంబడుచుండును. అన్నము రుచింపదు. నిద్రరాదు. తదేక ధ్యానముగాఁ దిరుగుచుంటి. మదీయ ప్రమాదమెఱిగియాయతి యొకనాఁడునన్నుఁజీఱి యోరీ ! నీ స్థితి వెనుకటిమాదిరిగా లేదేమి ? ఇట్లు చిక్కుచున్నా వేమని యడిగిన నేనిట్లంటి,

స్వామీ ! మీరు నా తప్పు మన్నింతు రంటిరేని యధార్ధము వాక్రుచ్చెద. నా మది నా యధీనములో లేదు. ఏమి చేయుదును. దేవర పాద సేవకుఁడగదా? నా కామితము తీర్పక తప్పదు. వినుండు అని బెదరుగదుర బలుకకున్న విని నవ్వుచు నవ్వనవాసి తుందిరా ! భయ పడియెదవేల క్రొత్తవాఁడవాయేమి ? నిక్కము వక్కాణింపుము. సందియములఁ దీర్తుననియభయహ స్తమిచ్చుటయు వెఱపుడిపికొని నే నిట్లంటి.

స్వామీ ! మీరు నిస్సంగులు గదా. వారమున కొకసారి యా నారీమణీలో నట్లు భోగించుచున్నా రేమి ? ఆ జవ్వని యెవ్వతియ ? ఈ పర్ణశాల కా యలంకారము లెక్కడినుండి వచ్చినవి. నా కన్ను లార పలుమారావింతలం జూచితిని. ఆ చిగురుఁ బోడిం జూచినది మొదలు నా మది చెదిరిపోయినది. మీ యొద్ద దాచనేల మీ వంటి వారికే యట్టి కామ్యము గలిగియుండ నా వంటివానికిం గలుగదా ? ఆ వృత్తాంతము చెప్పుమని యడిగిన నా జడదారి నవ్వుచు నిట్ల నియె.

తుందిలా ! ఇందులకా నీ వింత వలవంత గొనుచుంటివి ! విను మది యొక యక్షిణీకాంత నలువదియేండ్లు యక్షిణీశైలమున నారాధించి యమ్మించుబోఁడిని వశపరచుకొంటి తత్ప్రభావంబున నెప్పటి కప్పుడే యా శృంగార విలాసము లన్నియు నావిర్భవించు చుండును. వారమున కొక తేపవచ్చునట్లు నియమించితిని. ఆ జవ్వని యిచ్చి వచ్చినని వినోదములు చూపి యభీష్టగామంబులఁ దనుపుచుండును. కోరితి నేని స్వర్గపట్టణం బెదురంబెట్టి చూపఁగలదు. వలసినంత ద్రవ్యము తెచ్చియిచ్చును. అద్దేవత వశ్యయైనచో నాకముతోఁ బనిలేదను మాట సత్యమే వృద్ధులకైనఁ దారుఢ్య మొసఁగి క్రీడించును. ఆయువు వృద్ధిపఱచును. దీనంబరలోకహాని యుండదు. ఐహిక సుఖం నిండనుభవింపుచుఁ బదలోకసుఖంబు కొఱకై తపంబు గావించుచున్న వాఁడ నిదియే దీని వృత్తాంతమని తన కథయంతయుం జెప్పినవిని నేను క్రమ్మఱ నత్తపసి కిట్లంటి -

స్వామీ ఎఱిఁగియో ఎఱుఁగకయో మీ శిష్యుండొక విన్నపము జేసికొను