పుట:కాశీమజిలీకథలు -04.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

శతానందయోగి కథ

295

అప్పుడాలోపలి కృష్ణాజినములు కమండలువులు దర్బాసనములు నారచీరలు నేమైపోయినవో తెలియదు. అయ్యాకుటిల్లు విచిత్ర రత్నప్రభాధగద్ధగితంబై కాంచానాంబరవితాన సమావృతంబై బహు విధచిత్రప్రతిమాసమలం కృతకుడ్యంబై యింద్ర భవనమువలె మెఱయుచున్నది. అమ్మందిరాభ్యంత రమ్మున హంసతూలికాతల్పంబునఁ గూర్చుండి యొక పికవాణి వీణఁబాడుచున్నది. అయ్యారే ! ఆ తొయ్యలి చెలువం బిట్టిదని చెప్పుటకు నాకు శక్యము కాదు.

క. ఆమొగమాసగవానొస
   రామేనివిలాసమాయొ • యారం బాచె
   రామెఱుఁగుచూపు లా స్తన
   కోమల మెన్నంగ బ్రహ్మ • కును వశమగునే.

మా యయ్యవారయ్యెలనాగ తొడపై శిరంబిడుకొని తరుణ వయస్కుండై వీడెమువై చికొనుచు బండుకొని తద్గానం బాలింపుచుండిరి. ఆ వింత గనులారఁజూచి నేను విస్మయ సముద్రములో మునిఁగి ఈ జవ్వని యెవ్వతె ? యీ ఋషీకీయభిలాష యేమిటికిఁ గలుగవలయును ? ఇట్టివారే మారక్రియాసక్తులై యుండ నా బోఁటివాడు నిష్కాముం డెట్ల గును ? జన్మమెత్తినందుల కట్టి చక్కెరబొమ్మతోఁ గ్రీడించి నప్పుడుగదా సార్థకము ! బాపురే ! మా యయ్యవారా నారీమణిం బొందుటకెన్ని యేండ్లు తపంబు గావించెనోగదా ! మేలు మేలు భళి భళి. బాపురే ! ఆ తపసికిఁక స్వర్గమేల సామ్రాజ్యమేల ? చక్రవర్తులకైన వయసు మీరిన భోగవిముఖత గలుగును గదా ! ఈ తారుణ్య మెట్లువచ్చును ? ఇట్టి సుందరు లెక్కడ లభింతురు ? అయ్యో ! లోకాతిశయ సౌందర్యంబునం బొలుపొందు నీమ్దుముఖిం గనుగొంటి నిది నా జన్మకు జాలును. అని పెక్కు తెఱుంగులఁ దలంచుచుఁ దదీయక్రీడా విశేషములన్నియుం జూచుచుండ మోహం బొదవుటయుఁ జిత్తవిభ్రాంతి గలిగి యొడ లెఱుంగక పడిపోతిని.

మఱునాఁడుదయంబున లేచి చూడ నెప్పటి కుటీరము బోడితపసియుం గనంబడరి. అప్పుడు రాత్రి గనంబడిన విషయములన్నియు స్వప్న గతములని నిశ్చయించి యూయింతి సోయగమే తలంచుచు నత్తెఱంగుముని కెఱింగింపక యాదినము గడిపితిని, మఱియు నాఁటిరాత్రి నేను నిద్రబోక యా కుటీరమువంకనే చూచుచుంటిని కాని యేమియుం గనపడినదికాదు. అంతటితో విడువక ప్రతిదినము నట్టే చూచుచుంటిని. బాలకా ! విను మెనిమిదవనాడు రాత్రి మఱల నాకావింత గనంబడినది. మనం ఉవ్విలూరఁ జూచి చూచి తలయూచుచు నేనప్పుడాహా ! యిది ---------------- - "కు తెలిసినది. మా యయ్యగారు వారమున కొకసారి దివ్యాంగ in 1 . పులున్నాం గా అన్నన్నా : పగలే సమును మన వంతు ఏం సం రాత్రి యెన్ని విలాసములు వ్యక్తపరచుచుండెను. ఎట్టి రసికత్వము