పుట:కాశీమజిలీకథలు -04.pdf/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

గలవాఁడుఁగా దోఁచుచుండెను. గడ్డమంతయు నెరసి యురమును మఱుఁగు పెట్టబడిన తెరవలె మెఱయుచున్నది. తదీయ జటాకలాపగ్రంధి వీక్షింప ధనలోష్టీషభ్రమ గలుఁగ జేయకమానదు. శరీరమంతయు మడతలు పారినను మొగంబుమాత్రము లావణ్య యుక్తమై యొప్పుచున్నది. రుద్రాక్షమాలికారుచిరవక్షుండును భసితలిప్త సర్వాంగుడునై యయ్యతి రెండవ మేరుకోదండుని వడుపుంమెఱయచుఁ బర్ణశాలమ్రోల దళరచిత వటంబునం గూర్చుండి జపమాలికం ద్రిప్పుచు వేడుకలం గ్రీడించు లేడిపిల్లల యాట వీక్షింపుచుండెను.

అట్టి సమయంబునంబోయి నేనమ్మహాత్ముని పాదంబులకు నమస్కరించి యతఁడడుగ మదీయ వృత్తాంతమంతయుఁ జెప్పి తాపసేంద్రా ! ఆజన్మాంతము మీకంతేవాసుండనై పాదంబులచెంతఁ గాలంబు గడిపికొనియెద. నన్నుఁ గృతార్థుం గావింపుమని వేడుకొంటిని. అత్తాపసపురందరుండును దయామేదురములగు చూపులు నాపైఁ బరగింపుచు నిర్భయముగా నిందుండుముని యభయహస్త మిచ్చెను నేనును నిర్వ్యాజ శుశ్రూషాపరుండనై యత్తపుస్వీసత్తము నారాధింపుచుంటి. మటియును -

సీ. మునికన్న మున్న మే • ల్కొని పర్ణనివసధం
              బలికి చిత్రముగ మ్రు • గ్గులు ఘటింతు
    జటి తీర్దమాడంగ • సరసి కేగగఁ గమ
             డలపు గైకొని ముందు • నడుచుచుందు
    దేవపూజకుఁ బ్రయ • త్నింపఁగా సన్యాసి
            కమరింతు బాత్రల • నగ్రభూమి
    తపసిపడు వేళఁ • దడివల్కలములెత్తి
           యటకలితో రుద్ది • యారవైతు

గీ. ఱేయిఁగృష్ణాజినం బమ • రించి పండు
   కొనఁగఁ బాదంబులొత్తుదు • మునికి నెపుడు
   నిద్రలోనైనఁ జీరెనే • నియుఁ దపస్వి
   స్వామి ! పనియేమియని సమ • క్షమున నిలుతు.

అట్ల త్యంత భక్తివిశ్వాసముతో శుశ్రూషజేయుచుఁ గొన్ని దినములు గడిపితిని. అతండు రాత్రులఁ బర్ణశాలలోపలఁ బండుకొన నేను బహిర్వేదికపై శయనింతు నిట్లుండ నొకనాఁడు నడిఱేయి నేమిటికో లేచితి నప్పుడా పర్ణశాలలోఁ బట్టబగలు వంటి గాజుదీపముల కాంతి గనంబడినది. అది చూచి నేను వెఱగందుచుండ వల్ల కీతంత్రి నాదము శోత్రపర్వము గావించినది. అది విని నేనోహో యిది పర్ణశాల కాదా ! నేనెక్కడకైనం బోయితినా ? నిష్కాముండైన మా యయ్యవారింటిలో నిట్టి వెలుఁగు గలుగుటకుఁ గారణ మేమని యాలోచింపుచు నాకులసందునుండి లోనికిఁ దొంగి చూచితిని.