పుట:కాశీమజిలీకథలు -04.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

37]

వసుంధరుని కథ

289


సీ. భర్తృదారికగనం • బడదేమియో యంతి
             పురిలోనలేదని • పొక్కువారు
    అయ్యయో ? యేమయ్యె • నమ్ము ? రాతిరిబండు
             కొనమేడలో గంటి • మనెడువారు
    చాలప్రొద్దుగుదాఁక • బాలతోఁ గూడి యిం
             పుగఁ బాడితిమటంచు • వగచువారు
    అరయరే! నిష్కుట • మందుఁ గ్రుమ్మఱునేమొ
             యనఁ జూచివచ్చితి • మనెడువారు

గీ. ఎందులేదమ్మ ? యాకొమ్మ • యేమమాయ
    యో గదమ్మ నృపాంగన • కొక్క ప్రాణ
    మమ్మ యాబాలయెటుసైచు • నమ్మ దేవి
    యనుచు శోకింపుచుండిరం • దందుసఖులు.

అట్లు కళావతిని వెదకి యెందునుం గానక కొందలమందుచుఁ గొంద ఱిందుముఖులు కళానిలయ కత్తెరంగెఱింగించుటయు నమ్మించుబోడి యయ్యుత్పాతంబు విని పెద్దగాలిం జలించు కదళియుం బోలె వడంకుచుఁ బల్ల వికం జీరి యావారిజాక్షితో నేడీ విపాతంబునకు హేతువేమని చింతింపుచున్న నాజన్నిగట్టు శిరంబున నొక శాలువ జుట్టి మఱియొకటి మేనం గప్పికొనుచు మొగంబున నిండిన గుంకుమరేఖ జూపరులకు వెఱపుగలుగఁజేయఁ లోనికివచ్చిన యతనిజూచి రాజపత్ని కన్నీ రుదుడుచు కొనుచు శిరంబువంచి నమస్కరించి పల్లవికకుఁ గనుసన్న జేసినది.

పల్లవిక యా పాఱుని లోపలికిఁ దీసికొనిపోయి యార్యా ! నీవు మఱచి పోయి మా రాజుపుత్రికకు మంత్రించితివా యేమి ? యా చిన్నది కనఁబడుటలేదు. అని యడిగిన నతండు అదియెవ్వతెయో నాకుఁ దెలియదు. మీరు వ్రాసిపంపిన చిన్నదానిపేరు జపించితిననుటయుఁ బల్ల విక యుల్లము తల్లడిల్ల గుండెపై చేయిడు కొనుచు నమ్మయ్యో ? చిన్నదనుచుంటివేమి? మేము చిన్న వానిపేరు వ్రాసి పంపితిమే ప్రమాదము జరగలేదు గద యని పలికినవిని యతండు జడియుచుఁ దనయొద్ద నున్న కాగితమువిప్పి చూ పెను. అందుఁ గళానిలయకూఁతురు గళావతి యని వ్రాయఁబడి యున్నది. ఇదియే నేను జపించినపేరని చెప్పగా నప్పడఁతి నేలంబడి మూర్ఛిల్లి యొక్కింతకు దెప్పరిల్లి అయ్యో ! యిఁక నేమియున్నది ? కొంపమునిఁగినది.

రాజపుత్రికనే యడవిపాలు సేసితివే ? మేము పంపిన కాగిత మిదికాదు. ఇది మీయొద్ద కెట్లువచ్చినది. దీని మొదటి దినమున రాజపుత్రికకు శరీరములో స్వస్థత తప్పుటచే విభూతి పెట్టుటకై యా పేరు వ్రాసిపంపితిమి. పితిమి. 2. సవర్చనం. ఆహా : మిగుల విస్మము గాని. .. . Supia " తినాయన పలిన సమ్మకాసురుం... న తు లు ...