పుట:కాశీమజిలీకథలు -04.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5]

లవంగికథ

33

సిద్దపఱచి యుంచిన శుద్ధాంతములో నయ్యింతులఁ బ్రవేశ పెట్టి వలయునట్టి సామాగ్రి యంతయు నిచ్చి యితరులం బోనీయక కాపుపెట్టి యతిగుప్తముగాఁ గాపాడుచుండెను. లవంగియు నత్తెఱంగంతయు వీరునివలనం గలిగినదని చెలికత్తియిలచేఁ దెలిసికొన యబ్బంధనంబు సైత మొక బంధుకృత్యముగాఁ దలఁచుచు తనగౌరవమున కించు కేనియు హాని రాకుండఁ గాపాడు వీరునయందు మిగుల ననురాగము జనింపఁ దండ్రి వలన నతనికేమిముప్పు వచ్చునోయని వెఱచుచుండెను. అట్లు తురక రాపట్టిని బంధీ గృహంబునబెట్టి నాఁటిసాయంకాలమున గవనులకుంజని వీరభటులకాయోధన ప్రకారం బెఱింగించి రణభేరి నినాదంబులు భూనభోంతరాళంబులు నిండ భండనంబునకు నాయితము చేసి నిలువంబెట్టెను.

ఆధ్వనివిని యవనభటులు చటులగతినుబ్బుచు బవరమునకు వేగ నాజ్ఞ యిమ్మని వజీరుం గోరుకొనిరి. అతండును రణభేరిని వాయింప నియమించి సేనల బారులు నిలువఁబెట్టి యుద్ధమునకు వెడలుసమయమున రాజపుత్రికతో నరిగినభటులు వచ్చి శత్రువులు లవంగిం జెరఁదీసికొని పోయిన వృత్తాంతమంతయు జెప్పిరి. ఆవార్త విని మంత్రి ఱెక్కలు విరిగిన పక్షివలె నేలగూలి యొక్కింతతడ వొడలెఱుంగక యెట్టకేలకుఁ దెప్పరిల్లి రణఘోషంబు లుడిగించి చింతించుచు సేనాధిపతిని రప్పించి యిట్లనియె.

అయ్యయ్యో? ఎంతమోసము వచ్చినదో సూచితిరా? నేను బ్రమాదవశంబున మనరాజపుత్రికను యుద్ధసమయముల నిందుండవలదని బలత్కారముగా నిన్న నింటికి బంపితిని. దారిలో వైరులువచ్చి యచ్చెలువ సంచలములతోఁగూడాఁ దీసికొనిపోయిఁరట. ఏమి చేయుదురోకదా? బలత్కారముగాఁ జంపక విడుతురా? శత్రువులకు జాలి కలుగునా? నేను పాదుషాగారి సెలవులేనిదే యావాల్గంటి నింటికిం బంపితిని. పంపినను దగుసేస నిచ్చిన నింత ముప్పు వచ్చునా? ఇప్పుడేమిచేయుదును. ఈమాటలువినిన పాదుషా నన్ను శిరచ్ఛేదము చేయక విడుచునా? ఆచిన్నది యాయనకుఁ బంచప్రాణములలో నొక ప్రాణమైయున్నది. ఆమెకోరిక నెట్టిపనియయినఁ జేయించుచున్నాడు. మదీయవంశాంతమునకే నాకిట్టి బుద్దిపుట్టినది. అని దుఃఖించుచున్న మంత్రిని నూరడించుచు దళవాయి యిట్లనియె.

స్వామీ? మీరుపకరించకమే యప్పనిఁ జేసితిరి. మనలఁదట ఘటించి పగతురు రాజపుత్రిక నెత్తుకొని పోయిరి కానిండు. ఇప్పుడు మాకాజ్ఞయిండు. వీఱిపైబడి శత్రువుల మర్దించి స్వామి పుత్రికను వెదకి తీసికొనివత్తుము. మేము మాత్రము శూరులముగామా యని పలికినవిని మంత్రి "అయ్యా! అంతవరకు నన్నెలంతను బ్రతుకనిత్తురా పగ సాధించువారు ప్రియములు సేయుదురా? --------------------. సామముననే కార్యముం జక్కఁ జేసికొనవలయును తొందర వలదు. ప్రస్తుతము సంగరము నిలుపుసేయుడు. రహస్యముగా నరిగి యప్పురిలో