పుట:కాశీమజిలీకథలు -04.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వసుంధరుని కథ

285

కళా - మీ తల్లి కంటే నేనసతినా ? కొన్ని దినములు వేశ్యయై దిరిగి ద్రవ్యము సంపాదించి పెక్కండ్రఁ బతులగా వరించి చివరి కల్లాలువలెఁ గూర్చుండినం దెలియదనుకొంటివా యేమి ?

మందా - అమ్మా ! నేను రంకులాడిని. నాతో వియ్యమందవద్దు. ఎఱుఁగక కుఱ్ఱవాఁడన్నమాట పాటింపకుము.

కళా - నీతో వియ్యమందకున్న నెవ్వరితో నందుదును నీ పాటి వారు మాకు దొరకుదురా ? వీడు కుఱ్ఱవాఁడా | రాజుతోఁజెప్పి వీని నేమి చేయింతునో చూడుము.

వసుం - నీయర చేతికిఁ బండ్లువచ్చినప్పుడే చూతుములే.

మందార - అమ్మా ! వచ్చినవేశ మంచిదికాదు మొదటనే విరసముగా మాట్లాడితివి. ఇప్పటికి దయచేయుము. అని సవిసయముగాఁ ద్రోయుచున్నది.

కళానిలయ - అవును మర్యాద గ్రహింపక యిట్టినీచుల యింటికివచ్చుట నాదియే తప్పు అని పలికి కోపముతోఁ బుత్రిక నెత్తికొని బండియెక్కి యింటికింబోయి యీర్యాకషాయిత హృదయయై కోప గృహంబునఁ బండుకొని పరాభవదుఃఖాగ్నిం బొగులుచుఁ దనబాల సఖురాలు పల్ల వికయను దాని రప్పించి యిట్లనియె.

పల్లవికా ! నేఁడులేచి యెవ్వరి మొగంబు జూచితినో కాని యిట్టి పరాభ భవము నాజన్మమున నెఱుంగను. పదియేండ్ల ప్రాయము గల మనకళావతికిఁ బ్రాయమునకు మించిన చదువు చెప్పితినని గరువము జెందుచు నేఁడు మందారపల్లి యొద్ద కరిగితిని. దాని కొడుకు జానెడు లేడు. పిల్లను నన్నుఁగూడ బూర్వపక్షముచేసిలు మాటాడనిచ్చిన వాఁడు కాఁడు. అది యట్లుండె. వాని పొగరు వింటివా ? మొగమాట ముడిగి నన్న సతినని నొక్కి వక్కాణించెను. తల్లి యు వినుచు నూరకున్నది. కాని కుమారుని మందలించినదికాదు. పెక్కులేల ? నోఁటికి రాని మాటలాడి విడిచిపెట్టిరి. అక్కటా ! యీయవమాన శోకమెట్టులీగికొందును ? ఉపాయమేమి ? ఈ సంతాపము నా మదిం దహించుచున్నదని పలికి పల్ల టిల్లి న నప్పల్లవిక యిట్లనియె.

దేవీ నీవొంటివై యేమిటి కక్కడి కరిగితివి ? నాకుం జెప్పితివి కావేమి ? ఆమె నవమానింప నరిగిన దై వము నీకే యవి కలుగఁ జేసెను. ఎదిరి బలాబలములు విచారింపక పోవుదురా ? పోనిమ్ము. ఇప్పుడు రాయల వారితో వారు చేసిన యగౌరవమును వక్కాణింతము. తగిన శిక్ష విధింపకుందురా యని పలికిన విని ------- తలద్రిప్పుచు నిందులకు రేఁడు పూఁతకొనిరాడు. చెప్పినం బ్రయోజనం లేదు. దాని తండ్రి పాదుషా యొద్ద మంత్రిగా నుండెనని వెఱచును. ఆ . . . . 10 లడు నుపాయము మనమే యాలోచించ వలయును ఎట్టులో మనం సత్పతి మేని యాగరిత గరువంబు విడిచి పొగులు చుండును. .... అన్న చు తన మీపమునకు ఫలంబనుభవించెడిని. ఇదియే కగము. పుం, తను. " 0