పుట:కాశీమజిలీకథలు -04.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

యిక్కార్యంబు కొనసాగించి నాయిక్కట్టు బాపెదవని నమ్మియుండెదనని సానునయముగాఁ బ్రార్దించినది. పల్లవిక యట్టి పనులం దంతకుముందు గడిదేర యున్నది కావున నప్పని కొడంబడి రాజపత్ని నోదార్చుచు నాటంగోలె వసుంధరుం జంపు తెరంగరయు చుండెను.

వసుంధరుం డెన్నఁడు మందారవల్లిని విడిచి యుండడు. సంతతము విద్యాగోష్టియే చేయుచుండును. విహారమునకైన బయటకు రాడు. సదా పల్ల విక యా యుద్యానవన ప్రాంతమందే తిరుగు చుండెను. కాన యాబాలకుని జూచుటకైన శక్యమైనదికాదు. అట్లు కొంతకాలము జరిగినది. మరియొకనాడు పల్ల విక కళానిలయ యొద్దకు వచ్చినం జూచి దీర్ఘ క్రోధినియగు నమ్మగువ సఖీ ! నీతో నా కార్యము జెప్పి రెండు సంవత్సరములు కావచ్చినది. సాధించలేక పోయితివిగదా. నీపు నిశ్చయముగాఁ దలఁచుకొంటివేని శత్రువులఁ బరిభవింపలేవా ? యశ్రద్ధ చేయుచుంటివని పలికినఁ బల్లవిక అమ్మా ! అట్లనకుము. నాశక్తికొలఁది యాలోచించుచుంటి శక్యము కాకున్నది. ఆ బాలుం డొక్క మాటైన నీవలకు రాడుగదా. ఇప్పుడు మఱియొక యాలోచన చేసితి వినుము. దక్షిణదేశ మెల్ల దిరిగి సోమశేఖరుండను బ్రాహ్మణుండు మనవీఁడు వచ్చెను. మంత్రశాస్త్రమందతండఖండ ప్రజ్ఞకలవాఁడని చెప్పుచున్నారు. ఆ పాఱుండు మంత్ర ప్రయోగంబున నాడింభకుంజంప గలడు. అట్టిమాట నే నాయనతోఁ జెప్పితినేని సమ్మతింపడు దీసికొని వచ్చెదను రహస్యముగా నీవే యాయనతో మాట్లాడుము. తగిన సొమ్మిత్తువేని యొడఁబడునని చెప్పిన సంతసించుచు నప్పుడే పోయి యాబాడబుం తీసుకొని రమ్మని చెప్పినది.

పల్ల విక యొకనాఁడు సాయంకాలమున సమయ మరిసి సోమశేఖరు నింటికిం బోయినది. రక్షరేకుల కొఱకును విభూతి కొఱకుఁ బెక్కండ్రు జనులతని వేచి కొని యుండిరి. అతండప్పుడు దేశీమందిరము ముందరఁ బులితోలుపై గూర్చుండి లలాటమునఁ గుంకుమ రేఖ మెఱయవిభూతి రుద్రాక్షమాలికా విరాజిత గాత్రుండై జపము జేసికొను చుండెను. ఒక వంక గాయకులు దేవీ స్తోత్ర కీర్తనల బాడుచుండిరి. యొకమూల బాహ్మణులు స్వస్తి చెప్పుచుండిరి. ఒకవైపు నాట్యములు జరుగు చుండెను.

అట్టి వినోదము చూచి పల్ల వికి విస్మయము జెందుచుఁ బూజావసానము దనుకఁ బ్రతీక్షించియుండి ప్రసాదము గై కొని యెట్లో సమయము జేసికొని రాజపత్ని యగు కళానిలయ ఱేపొకసారి మిమ్ము దర్శన మీయమని కోరినదని చెప్పెను. ఆ మాంత్రికుండామాట విని సంతసించచు ఱేపు ప్రొద్దున వత్తునని యుత్తరముచెప్పి దాని నంపెను.

పల్లవిక మరునాఁడుదయ కాలంబునంబోయి కళానిలయతో సోమశేఖరుని పూజాప్రకారమంతయు చెప్పుచుండఁగనే సోమశేఖరుం డచ్చటికి వచ్చెను. రాజపత్ని