పుట:కాశీమజిలీకథలు -04.pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

క్రియలచే నన్యోన్యము గలిసికొనుట సంభోగమని దశ రూపకమునఁ జెప్పబడి యున్నది. అనకూల శబ్దమున కర్దమేమియో చెప్పుము. నాయిక తరుణియు నాయకుఁడు వృద్ధుఁడైన ననుకూలమెట్ల గును. రాజు ధనము గలవాఁడు కనుక ననుకూలుఁడని చెప్పవలయును కాఁబోలు. మఱియు నగ్నిమిత్రుఁడు మొదట మాళవికను వరించునప్పుడు రాజపుత్రికయని వరించెనా యేమి ?

కళానిలయ - దుష్యంతాదులు వృద్ధులనియా నీ యభిప్రాయము ?

వసుం - నీ యభిప్రాయము బాలురనియా యేమి ?

కళానిలయ - కాక యెవరు ?

వసుం - వారి కొడుకులు బాలురకుఁ దండ్రులు. వినుము అగ్నిమిత్రునకు వసులక్ష్మియను కూఁతురును వసుమిత్రుండను కొడుకున్నట్లు వ్రాయఁబడినది చూచితివా ? వసుమిత్రుఁడే కాదా సవనాశ్వము వెంట నరిగెనని చెప్పిరి. పదునెనిమిది యేండ్లైన నుండినంగాని గుఱ్ఱము వెంట గాపాడఁ బోవఁడుగదా. అట్టివానికి సంతాన మేలకలుగ కుండెడిది.

కళానిలయ - వారు సేవతుల్యులు. వారికి జరలేదు.

పసుం - మంచి సమాధానమే చెప్పితివి. చాలు చాలు అమ్మా ! యీమె యెవ్వతెయే ?

మందా - రాయలవారి భార్య. కళానిలయ యని చెప్పగా విని యుండ లేదా ?

వసుం – ఎక్కడనో వినియున్న పేరువలె నున్నది గదా.

మందా - మఱచితివా మొన్న పాఠము చెప్పుకొనునప్పుడు-

వసుం - ఆఁ ! జ్ఞాపకము వచ్చినది. ఓహో ! ఆమెయా యీమె !

కళా - (స్వ) మదీయ చరిత్ర వీరు పురాణముగాఁ జెప్పుకొనుచున్నారు కాఁబోలు. (ప్ర) బోఁటీ ! మీ పాఠములో నా మాటయేల వచ్చినది ?

మందా - ఏమిటికో వచ్చినది. జ్ఞాపకము లేదు.

కళా - జ్ఞాపకము చేసికొని చెప్పవలయును.

వసుం - అమ్మా ! నాకు జ్ఞాపకమున్నది. నేను చెప్పనా ?

మందా - (కనుసన్నచే వారించుచున్నది) )

కళా - డింభకా ! భయము లేదు చెప్పుము.

వసుం - మా యమ్మ అసతీత్వప్రశంసలో నీ కథ యుదాహరణముగాఁ జెప్పినది. నీ యొద్ద దాపనేల ?

కళా - మీ యమ్మ నన్న సతినిగా వర్ణించినదా ?

వసుం - సందేహమేల ? నీవు పతివ్రతవేయైనచో భర్తనేల చంప సాహసింతువు ? నీ యొద్ద ననుకున్నను లోకులు చెప్పుకొనరాయేమి ?