పుట:కాశీమజిలీకథలు -04.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36]

వసుంధరుని కథ

281

నీకుఁ గలిగియున్న నీవే యామె యింటికింబోయి చూడుము. అని పలికి యా వృత్తాంతమంతయు జెప్పెను. అప్పుడప్పడఁతి నవ్వుచు నాధా ! నా కథ నేను వినియే చెప్పుచుంటి నది క్షత్రియ పుత్రికయను మాట యట్లుండనిండు నిజమైన వేశ్యయుం గూడ కాదు. అది పల్లెది చదువుకొన్నదని మెచ్చుకొనుచుఁ దెచ్చుకొని శిరంబునం బెట్టికొనుచున్నారు. దానివలచి రామలింగకవియె వ్యూహము బన్నెను. ఇప్పు డది మన యింటికి రమ్మనిన వచ్చునాయని పలికిన నా నరపతి చాలుచాలు నీ బుద్దిబలమంతయుం జూపుచుంటివి. ఆమె తల్లిదండ్రులు ఢిల్లీలో బుత్రియని యొప్పుకొని నాకుఁ బత్రికలు వ్రాసినది నీవెరుంగవు. అతి ప్రసంగముమాని చూడఁ దలంచుకొనినఁ బోయి చూడుము లేకున్న నూరకుండుమని మందలించెను.

వసుంధరుని కథ

మందారవల్లి విద్యావిశేషము లెల్లరు నద్భుతముగాఁ జెప్పుకొనుచుండ విని యీసుఁజెందుచు నాకాంతంబరిభవింపదలంచి కళానిలయ యొకనాఁడు పదియేండ్ల ప్రాయముగల కళావతి యను తన కూఁతుం దీసికొని యశ్వశకటంబుపై మందారవల్లి యున్న యుద్యానవనమున కరిగినది.

ఆమె రాక పనికత్తెల వలన విని మందారవల్లి యెదరు వచ్చి యాలింగనము జేసికొనుచు రాచపట్టని ముద్దు పెట్టుకొనుచు దోడ్కొనిపోయి యుచితాసనంబున గూర్చుండఁబెట్టి యెక్కుడుగా గౌరవించినది. అప్పుడు రాజపత్ని విదుషీమణీ ! భవదీయ కళాకౌశల్యము జగదంతయు వ్యాపించియున్నది. నీవనంగ విద్యా స్వరూపిణి వేయని లబ్దవర్ణులు వక్కాణించుచున్నారు. నీ వర్దులకుఁ గామదాయినివఁట. నీ చరిత్ర మంతయు గ్రంథములయందుఁ జూచి విస్మయముఁ జెందుచు నిన్నుఁ జూడవచ్చితినని యగ్గించినఁ దలయూచుచు మందారవల్లి యిట్లనియె. అమ్మా ! కళలన్నియుఁ బేరుగా గట్టికొని తిరిగెడి నీవును నన్నగ్గింపవలయునా ? నీ భర్తయు కులీనుండనియు నీవు పండితురాలవనియు దోషజ్ఞులు వర్ణించుచుండఁ బలుమారు వింటిని. నీ సాహస మొరులకు రాదు. కళావంతులు రతి కెక్కడుగా నీసు భగత్వము గొనియాడుచుందురఁట. నీకు నీవే సాటి. నిన్నుఁ జూడవలయునని యెన్నియో దినంబులనుండి యాసపడు చుంటి. నేఁటికి నా కన్నులకరపు దీఱినదని మందారవల్లి పెద్దగాఁ బొగడినది.

అప్పుడు కళానిలయ కొమ్మా ! పోనిమ్ము. నీ స్తుతి వచనములు మనకలవాటు పడినవే కదా ? యీ బాల కావ్యనాటకాలంకారాది గ్రంథములు చదివినది. యెందేనిం బరీక్షించి యడుగుము. తన పాటివారు లేరని గరువముఁ జెందుచున్నదని పలికిన నవ్వుచు మందారవల్లి వసుంధరా ? ఏమి చేయుచున్నావు ? ఒకసారి యిటురా. --------------- యొకబాలునిం జీరనది.

అప్పుడా లోపలినుండి పండ్రెండేఁడులబ్రాయముగల -------- డొకం