పుట:కాశీమజిలీకథలు -04.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దేవదూత కథ

279

ఆ వార్తవిని ధనంజయ నృపాలుండు సకుటుంబముగా వచ్చి వారింగాంచి తమదంత మాద్యంతంబువిని వెఱంగుపడుచుఁ బుష్పహాసుండు తన మేనల్లుఁడని యనుమానము జెందితిననియు దండనాధుఁడు తనకు వ్రాసిపంపిన దేవాలయము గోడపైనున్న పద్యములం జూచి పుష్పహాసుని లలిత వరించి యేగినదనియుఁ దిలక సహకారిణిగా నున్నదని శిక్షవిధించిన యనంతర మూహించితిననియు మఱల నాశిక్ష తగ్గించి యట్టి యాజ్ఞ పంపితిననియు లోనగు తంత్రంబులన్నియుం జెప్పుచుఁ బుత్రికం గారవింపుచు లలితం గౌగలించుచుఁ బలుతెఱంగులఁ దన సంతోషమును వెల్లడించెను. అట్లు వారు పరస్పరానుగంబులం దెలుపుచు రెండు మూడు దినంబులు గడుపుదురు

అప్పుడు దేవదూత శుభముహూర్తంబున లలితా పుష్పహాసులకు వివాహ మహోత్సవము గావింపఁజేసి పిమ్మటఁ గుబేరున కాతెఱంగెరిగించి వచ్చి యతనిచే నంపఁబడిన నవరత్నమాల యొకటి పుష్పహాసుని కంఠంబునవైచి దీనిం ధరించినవారు వేయేండ్లు జీవింతురని తత్ప్రభావమగ్గింపుచు నతనిం బట్టభద్రుం గావింపజేయును. పుష్పహాసుండు తల్లి దండ్రుల యనుమతివడసి యత్తమామల కామోదము గలుగఁ జేయుచు దేవదూతకు బ్రీతిగా నట్లు పట్టాభిషిక్తుండై ధర్మంబున రాజ్యంబు జేయుచు సకల సుఖంబుల ననుభవింపుచుండును. దేవదూత వారిచే నామంత్రితుండై యలకా పురంబున కరుగును అని భవిష్యత్కధ యంతయు జెప్పి మణిసిద్ధుండు శిష్యునితోఁ గూడ నవ్వలి మజిలీ చేరెను.

నలువది యైదవ మజిలీ

క. శ్రీకర ప్రళయ స్తితిస
   ర్గైకనిదానప్రధాన హరిహరచతురా
   స్యాకారవినుత త్రిగుణ ని
   రాకార ప్రపూర్ణ సచ్చిదానందమయా.

దేవా యవధరింపుము -

అయ్యవసరంబున గోపాలుం డెక్కడికిం బోవక యందున్న చావడి యఱుగుఁపై గూర్చుండి యెద్దియో ధ్యానించుచుండెను. ఇంతలో నయ్యవారు ----------- నములం దీర్చుకొని భుజించి వాకిటకు వచ్చి వానింజూచి వత్సా ! ------------ విచిత్రము ; ఎక్కడికిం బోవక యిందే యుంటివి ? విశేషము లేమని యడిగిన వాఁడు లేచి నమస్కరించుచు స్వామీ ! ఇది కడు చిన్న గ్రామము దాపున jui, vు గనంబు పని తలంచి కలం నుంచి ... ముండని.. : సీల గ్నో సంచయం.. నను..... " స్పంది చెప్పితే ! యని పలికిన సయ్య తిపతి “50 - పిమ్మట సంతయుం - ఎలము