పుట:కాశీమజిలీకథలు -04.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వృత్తాంతము విని వసంత సేన అమ్మకచెల్లా ! దైవసంఘటన మెంత చిత్రముగా నున్నది.

తాననే కాఁబోలు నీమెం జూచినది మొదలు నా మది యూరక తపించినది ఆహా ! యని యచ్చెరువు నొందుచుండెను

శ్లో॥ వ్యతిషజితిపదార్ధానాతరః కోపిహేతు
      ర్నఖలుబహిరు పాదీన్ప్రీతయస్సశ్రయంతె
      వికసతిహి పతంగస్యోదయె పుండరీకం
      ద్రవతిచ హిమారశ్మాపుద్గతేచంద్రకాంతః॥

ప్రీతులకు బాహ్యోపాదులు కారణములు కావు. అంతరంగికమగు హేతు వెద్దియో వానికిఁ గారణమై యుండును. అంతరిక్షమందు మిక్కిలి దూరముగా నున్న సూర్యుఁడుదయించినతోడనే పద్మములు వికసించుచున్నవి. చంద్రోదయమైన తోడనే చంద్రకాంతశిలలు ద్రవించుచున్నవని పుష్పహాసుండు శ్లోకముచదివెను. వరుణదత్తుడు గంధర్వదత్త వృత్తాంతమునువిని మిక్కిలి పరితపించుచు మన పుష్పదంతుండెందున్న వాడో దైవకృపచే నాతండు గూడ గానఁబడిన నీ జన్మకుఁ గోరవలసినది లేదుగా యని పలికిన తిలక -

అయ్యా ! ఆ కొరంతయు దైవము తీర్పకమానఁడు మీ మేనగోడలు లలితయు మాతోపాటు చాలా యిడుములం గుడుచుచున్నది చూచితిరాయని చెప్పిన ధనంజయుని కూతురా ? యేది యిటు తీసికొనిరండు. బంధువ్యూహ మంతయు నొక్కచోటికే తీసికొని వచ్చెనే భగవంతుఁడెంత యనుకూలుఁడయ్యెనని వరుణదత్తుడు పలుకుచుండగనే తిలకబోయి పురుష వేషముతో నున్న లలితం దీసికొని వచ్చి చూపినది. చూచి వరుణదత్తుఁడు "ఈతఁడు శిక్షింపబడిన మకరందుఁడుకాదా ? యిందాక నీ దోటలోఁ జూచితినే ? లలిత యేది యని యడిగిన నవ్వుచు తిలక స్త్రీ వేషముతో నందున్నవాఁడు పుష్పహాసుండని తెలిసికొన్నది. కావున భగవంతుని మాయయద్భుతమైనది కాదా! స్త్రీలను బురుషులు గాను బురుషుల స్త్రీలఁగాను మార్చుచుండును. ------- యీ పుష్పహాసుని నిమిత్తమై పురుషుండైనది, పుష్పహాసుండు లలిత నిమిత్తమై స్త్రీ యయ్యెను. ఈ పుష్పహాసుఁడే మీ పుష్పదంతుఁడని చెప్పఁగలను. గంధర్వ దత్త పోలికయు వీని పోలికయు నొక్కటిగా నున్నదని పలుకుచు బుష్పహాసుని గంధర్వదత్త దాపున నిలువం బెట్టిన నచ్చుగుద్దినట్టుగా యొక్కటయే మొగము వలె పోలిక యగుపడినది. గంధర్వదత్త నప్పుడు పాలుచేపు వచ్చినవి. వరుణదత్తుఁడు విస్మయముతోఁ జూచుచుండెను. ----------- దిలక మకరందుని బుష్పహాసుని బ్రక్కకుఁ దీసికొని వచ్చి నిలఁబెట్టి --------- నీ కొడుకును గోఁడలును చూచుకొను మని పలుకుచుండగనే యాకాశమునుండి యొక దేవదూత మందముతో దిగి సత్యము రాజా ! సత్యము. వీఁడే నీ కొడుకు పుష్పదంతుఁడు.