పుట:కాశీమజిలీకథలు -04.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

35]

సుల్తానుగారి కథ

273

విమర్శించెదనని పలికినది. ఆ మాటవిని వసంతసేన ఆ విషయమేమియది ? ఈమె యట్లు కన్నీరు విడుచుచున్న దేమి ? గంధర్వదత్తను మీరెఱుఁగుదురా ? యని యడిగిన, తిలక యెఱుఁగుదుము. నేనువచ్చి నీభర్తగారితో మాట్లాడి చెప్పెదనని పలికి భుజించిన పిదప వసంత సేన వెనుక నాగదిలోనికిం బోయినది.

ఆ పుష్పహాసుఁ డాతిలకం జూచి గురుతుపట్టి సంభ్రమముతో నెలతుకా ! నీ పేరు తిలక కాదా ? నీ విక్కడి కెట్లు వచ్చితివి ? నీ స్నేహితురాలేమైనదని యడిగిన నేను దిలకనే ప్రారబ్దవశమున నిచ్చటికి రావలసి వచ్చినది. నాసఖురాలు నా తోడనే యున్నది. కాని గురుతు పట్టజాలకున్నాను. నీపేరు చెప్పి నాకును సంతోషము గలుగఁజేయుమని పలికినది.

అంతలో వరుణదత్తుఁడు లేచి వసంతసేనా ? నాకు బయనము సిద్దపఱచుము. వింధ్యకూటనగరంబునకుం బోయి నాప్రాణనాయకి గంధర్వదత్తం జూడవలయు. నాలస్యము చేయకుమని పలుకగా విని తిలక దేవా ! మీరంతదూరము పోనక్కరలేదు. మీరు మణికుండలులే యైనచో గంధర్వదత్త యిక్కడనే యున్నదని పలికిన విని యేదీ ? వట్టిమాటలు చెప్పుచున్నారు. నేను నిశ్చయముగా మణికుండలుడనే హా ! గంధర్వదత్తా యిటురా నీప్రాణేశ్వరుఁ డిందున్నాడు. నీవ్రతము లిప్పటికి ఫలించినవేమో ! యని పలుకగా విని మహిళ యా లోపలినుండి యక్కడకు వచ్చి నామనోహరుండేడీ ? యని పలికినది.

వరుణదత్తుఁడామెంజూచి మంచము డిగ్గనురికి హా ! ప్రాణేశ్వరీ ! హా గంధర్వదత్తా ! నేనిందున్నట్లెవ్వరు చెప్పిరి. ఎట్లు వచ్చితివని పలుకుచు బిగ్గరఁగా గౌఁగలించుకొనియెను. గంధర్వదత్తయుఁ బెద్ద యెలుఁగున నేడువఁ దొడంగినది.

వసంత తెల్లపోయి చూచుచున్నది. పుష్పహాసుండును నివ్వెరపడి నిలువంబడియె. తిలకయు నాశ్చర్యసాగరంబున మునింగెను. అట్లు కొంతసేపు వియోగ దుఃఖం బనుభవించిన తరువాత వసంత సేన వారినెల్ల గూర్చుండ నియోగించ ప్రాణేశ్వరా ! యీ గంధర్వదత్త నీ ప్రాణేశ్వరి యెట్ల య్యెను ? యీ మాటం యెప్పుడుం జెప్పితిరి కారేమి ? ఇప్పుడైన స్పష్టముగా మీ వృత్తాంతము తెలియఁజేసి నా సందియము పోఁగొట్టుఁడని వేడికొనిన స్వస్తుండై వరుణదత్తుం డిట్ల నియె.

రమణీ ! నేను సముద్రంబునంబడి తేలి మీయూరు వచ్చిన యుదంత మంతయు నీవు విని యుంటివి గదా ? అంతకు బూర్వ చారిత్రము మీకు నేను జెప్పి యుండలేదు. నాకును స్వప్న ప్రవృత్తివలె దానిం జెప్పుటకు బుద్ధియాకలించినదికాదు. లెక్కించుకొన నేను మా వీఁడు విడిచి నేఁటికు బదియారు సంవత్సరములైనది. - (ద గంధర్వపకతోఁ బు తును మనము న్యూ ..... 2 ఏ సున్నిత మన్వం.. of... - తము. చిమ్మట తిలక గంధర్వరమును - నరుం స్పంచు తుపులు !