పుట:కాశీమజిలీకథలు -04.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

272

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వచ్చితివఁట విచారించుచున్నదని పలికినవిని దిగ్గునలేచి నాప్రాణసఖియేదీ ? యిటు రమ్మను కుమారునింగూడ దీసికొని వచ్చినదా ? ఎంత స్వప్నము గంటినని పలుకుచు నలుమూలలు సూచుచుండెను. పుష్పహాసుండు తండ్రీ ! నీపేరు మణికుండలుడుకదా? వింధ్యకూట నగరమున నుండి యిక్కడి కెట్లువచ్చితివని యడిగిన నతండు పుత్రీ ! నీవు నిజము గ్రహించితివి. నా పేరు మణికుండలుఁడే మా కాపురము వింధ్యకూట నగరమే యిక్కడికి నిజముగా వచ్చితినా ? స్వప్నమను కొనుచున్నాను కానిమ్ము నాభార్య గంధర్వదత్తం జూపుమని యడిగెను.

విభ్రాంతస్వాంతయై చూచుచున్న వసంతసేనతోఁ బుష్పహాసుండమ్మా ! వీరి చరిత్రము నాకిప్పటికి బోధపడినది. ఒకప్పుడు నేను ధనంజయుడను రాజునొద్ద కొక కడియము కానుకగాఁ తీసికొని పోయితిని. ఆరాజు వీరి చరిత్రమంతయు నప్పుడు చెప్పెను. ఈతండు భార్యతోఁ బుత్త్రునితోఁ గూడికొని మేడమీదఁ బండుకొని మఱునాఁడుదయమునఁ గనబడలేదఁట. వీరి నిమిత్తమై దేశదేశము లాయన వెదకించెనఁట. యెందునుం గనంబడలేదని విచారించుచున్నాఁడు ఇప్పుడా వృత్తాంత మంతఃకరణ గోచరమైనది దానంజేసి చింతించుచున్నాఁడిదియే కారణము. మఱేమియు భయము లేదని యూరడించెను.

అప్పుడా వరుణదత్తుడౌను నీవనినదే యధార్తము ధనంజయుండు నా కుస్యాలకుఁడే. పాపము నానిమిత్తము వెదకించుచున్నాడా ? యిందున్నానని యెరుఁగఁడు కాబోలునని యుత్తరము చెప్పెను. అంతలో నొక పరిచారిక వచ్చి అమ్మా ! వారికెవ్వరికో భోజనము పెట్టి తు నంటివఁట వచ్చి పెరటిలోఁ గూర్చుండిరి. అన్నా తురులై యున్నారు. వేగము వత్తు రేయని చెప్పిన అయ్యయ్యో ? ఎంత మరపువచ్చినది. పాపము పది దినములుండి వారు భుజించుటలేఁదట. యీ గొడవచే మఱచి పోయితిని. పుత్రీ ! నీవిందుండుము. వారికన్నముపెట్టి సత్వరముగాఁ జనుదెంతునని పలికి పోయి వారింగాంచి సాధ్వులారా : రండు వేరొక కారణంబున మీమాట మఱచి యాలస్యము చేసితినని పలుకుచు స్నానము చేయుట కుష్ణోదకమిప్పించి మనపుట్టములు గట్టనిచ్చి బంధువులంబోలె నాదరించుచు మృష్ణాన్నము వడ్డించినది.

అప్పుడు తిలకయు మహిళయువచ్చి మిక్కిలి యాకలిగొని యున్నవారు కావున నత్యాతురముతో భుజించిరి. ఎట్టియాపద యందైన నాఁకలిబాధ యెక్కుడు గదా ! వారు భుజించునప్పుడు వసంతసేన సతీమణులారా ! నెమ్మదిగా గుడువుఁడు. నాభర్తతో మీమాట సెప్పితిని. అప్పటి నుండియు గంధర్వదత్తా పుష్పదంతా యని యూరక పలవరింపుచున్నాడు అందలి కారణమేమియో తెలియదు. ఆయన మనసు కొంచెము స్థిమితమైన తోడనే దానుపకారము గావించెదరని చెప్పుచుండఁగనే మహిళ భుజించుటమాని యబ్బురపాటుతోఁ బరికింపుచుఁ గన్నీరు విడువఁజొచ్చినది.

అప్పుడు తిలక అమ్మా ! భుజింపుము. ఆ విషయమేదియో నేఁను