పుట:కాశీమజిలీకథలు -04.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

సుల్తానుగారి కథ

271

చందును. రక్షింపుమని యనేక ప్రకారములఁ బ్రార్దించిన మూర్చవచ్చునట్లుగా గొంతుక నొక్కి విడిచిపెట్టి యెప్పటియట్ల చేలము ధరించి స్త్రీ వేషముతో నిలువఁబడియెను. ఒక్కింత తడవునకు సుల్తాను తెప్పఱిల్లి యుల్లంబు పగుల బెండ్లి కూతుం జూచి వడంకుచు బోటీ ! నీ చెప్పినమాట వినక చచ్చినంత పాటుఁబడితిని. నీపొందు చాలు. పదివేలు సలాములు మాతల్లి కడుపున వెండియుం జనించితి నీ పుణ్యము నీజోలికెన్నడును రాను నీమగనితోఁ జెప్పుము, క్రమ్మఱ వచ్చునేమోయని వెఱచుచున్నవాఁడ అతండు కరుణించి విడిచెను. కాని మఱికొంచెము నొక్కెనేని నే నీ పాటికి స్వర్గలోకములో నుందును. నీవు నాకుఁ దల్లివి. నీకుఁ గోకలు పసపుకుంకుమ కానుకలిచ్చెదఁ గైకొని మీ యింటికిం బొమ్మని ప్రార్ధించిన నక్కపటయువతి నవ్వుచు మహారాజా ! ఇఁక నీవు వెఱవ వలదు. నా మగడు నీపొగడ్తలకు మెచ్చి విడిచి పెట్టెను. హాయిగా నిద్రబొమ్ము. రేపు ప్రొద్దున నేను మా యింటికిం బోయెదనని యోదార్చిన నతండట్లు పండుకొని నడుమ నతండు మఱలవచ్చి కుత్తుక పట్టుకొను నేమోయని యులికిపడుచు నెట్టకే దెల్ల వార్చెసు సూర్యోదయము కాకమున్న వెనుకటి శకటమును దెప్పించి యెవ్వరికిం జెప్పకుండఁ బెండ్లి కూతురను దానిమీఁద గూర్చుండఁబెట్టి కనకాంబర భూషణము లెన్ని యేని కానుకగానిచ్చి వరుణదత్తా ! నీవు పంపినది, యాఁడుదికాదు సైతాను. ఎఱుఁగక వరించితిని బుద్ధివచ్చినది. మఱల దానినిఁ గానుకలతో మీయింటి కనిపితినని యుత్తరము వ్రాసి యా వరుణదత్తునింటికని పెను.

పుష్పహాసుఁడట్లు సుల్తానును వంచించి యింటికింబోయి యా వృత్తాంతము వజ్రమాల కెఱిఁగించి కడుపుబ్బలాగున నవ్వించెను. పిమ్మట నాయుత్తరమును దీసి కొని వరుణదత్తునొద్ద కరిగిన వసంతసేన యతనింజూచి అమ్మా ! పోయివచ్చితివా ! నిన్నటినుండి మీ తండ్రికి స్మృతిలేదు. ఎద్దియో పలవరించును. నేదియును తెలియదు. నీవుమిగుల బుద్ధిమంతురాలవు వచ్చి చూడుమని పలికినఁ జింతించుచు నాగది లోనికిం బోయి జనకా ! యిటుచూడుము, నేను సుల్తానుగారి యొద్ద కరిగి వచ్చితిని. ఆయన మీకెద్దియో యుత్తర మిచ్చిరి, చూడుఁడని పలికిన నులికిపడినట్లు లేచి యేది యుత్తర మని యడిగెను.

అప్పుడాయుత్తర మతనికిచ్చినం బుచ్చుకొని చదువుకొని నవ్వుచు మంచి నేర్పరివె ? చెప్పినట్లు చేసితివని మెచ్చుచు నంతలో హా ! గంధర్వదత్తా ? హా పుష్ప దంత ! యని పలవరింపుచుఁ బండుకొనియెను. అప్పుడు వసంతసేన పుత్రీ ! జూచితివా ? రాత్రియెల్ల యిట్లే పలవరింపుచున్నారు

రెండవమాట లేదు. కారణమేమియో తెలియదని చెప్పఁగ నతఁడు ఎప్పటి నుండి నిట్లుపలవరింపు చున్నారని యడిగిన నప్పడఁతి నుద్యానవనములో o.. నది - దలు. జరిగిన విషయంతం.. అని ముందు, లకుమ చంద్ర : గంధర్వదత్త యిది - వచ్చింది. ఆ ను విడివి