పుట:కాశీమజిలీకథలు -04.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

31

చిన్నది గుడిలో బ్రవేశించినను దోషములేదు. స్వామి కభిషేకముఁ జేసినను జేయ వచ్చును. దాని చూపులు తలంచుకొనిన నా హృదయము వివశమగుచున్నది. మంచి సమయము మించఁబెట్టితినిగదా. అయ్యో? మఱికొంతసేపు దానితో ముచ్చటింపక పొమ్మంటి నావంటి వెంగలి యెందైనంగలడా? అమ్మహారాజపుత్రిక మాటకు వెయి దీనారము లిచ్చినను సంభాషించునా? వెఱ్ఱిపట్టునఁ బోగొట్టుకొంటి వెండియు దర్శనము సేయుదునంటగాని నివాసదేశం బడుగనైతి. అడిగినను నిజము జెప్పునా? తదీయ శృంగారవిలోకనములు నాయం దనురాగముఁ గలిగినట్లు తెలియఁజేయు చున్నవి. కానిమ్ము. అదియే సత్యమైనచోఁ గాముం డపకారముఁ జేయక మానఁడని తలంచి యంతలో నవ్వుకొనుచు మఱియు నిట్లు తలంచెను.

ఇప్పుడు నేనుచేసిన శపథముమాని కామకుండనైతినేల? కమను లిట్లే దలంచుచుందురు. మగవానింజూచి స్త్రీయని తలంచి తద్విలాసములు తనయం దారోపించుకొనినవాఁడు నేనుదక్క మఱియొకఁడు గలఁడా? సీ? యీ సంకల్పము నా కేమిటికిఁ గలుగవలయు? యవనపుత్రిక యట్లేలవచ్చును? నేనే భ్రమపడితినని క్రమ్మఱజిత్తమును మరలించుకొని మఱునాఁడు చేయవలసిన కృత్యము లాలోచించు కొనుచు నిదురపోయెను.

మఱునాఁడు వీరుండు కాశీరాజుగారికి పాదుషాగారి సైన్యం కొంతతిరుగ రానై యున్నది. కనుక మిగిలియున్న మీ సైన్యముఁ బంపుఁడని వ్రాసి తెప్పించుకొని యాయాయోగవనులం గాపుపెట్టి తాన్నని చోటులంజూచుచు నప్పురం గాపాడుచుండెను. కుందలతిలక యమ్మరునాఁడు మాఱువేషముతోఁ గాశీపట్టణమున కరిగి వీరుని వృత్తాంత మంతయుఁ దెలిసికొనివచ్చి యచ్చిగురాకుఁబోణి కిట్లనియె 'సఖీ! నిన్నటి దినము విశ్వనాథుని పడమర ద్వారమునఁవున్నవాఁడు వీరుఁడను బ్రాహ్మణకుమారుఁడు. వాని తండ్రిపేరు పండితభట్టఁట. ఆ విద్వాంసుఁ డీపట్టణమున మిగులఁ జాలినవాడఁట. ఏడ్గురు పుత్రులు పుట్టి చచ్చినవెనుక నీతండు పుట్టి తురకదేవతల యారాధనావిశేషమునఁ బ్రతికియున్నాడఁట. దానంజేసియే యతని వేషము తురక వేషముగా నున్నది అమ్మహావీరుండు విద్యచేఁ గాక పరాక్రమముచేఁ గూడ ననన్యసామాన్యుఁడై యున్నాడఁట. ఈ సన్నాహం బంతయు నతనిదే యని తదీయవృత్తాంత మంతయుం జెప్పినది. ఆ మాటలు విని యయ్యోషారత్నంబు సంతోషవిషాదంబులు మనంబునం బెనఁగొన గుందలతిలకతో బోటీ! మనవారి యుద్యమ మెట్లున్నది? సేనాని వ్రాసిన జాబున కేమని యుత్తరము వచ్చినది తెలిసికొనిరమ్మని చెప్పిన నవ్వెలఁది సేనాపతి నడిగివచ్చి లవంగితో నిట్లనియె.

యువతీ! మన వజీరు మఱికొంతసైన్యముతో రేపురాత్రి కిచటికి వచ్చునఁట. ఎల్లుండి వీటిపైఁబడి పోరాటము సేయుదురట. ఇదియే మనవారు చేయఁదలచుకొనిన