పుట:కాశీమజిలీకథలు -04.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34]

వసంతసేన కథ

265

స్త్రీలు శిక్షపడినది మొదలు నన్నము తినుటలేదఁట. చాల చిక్కి, యున్నారు. రాత్రి యెంత చెప్పినను గుడిచిరిగారు అయ్యగారికి త్తెరఁ గెఱింగింపఁ దలచుకొంటిమి. ఇటు రండు అని దారి చూపుచు నామెను వారి యొద్దకుఁ దీసికొనిపోయిరి.

అప్పుడందొక సుందరి పండుకొని దుఃఖించుచున్నది. రెండవది ప్రక్కనఁ గూర్చుండి యూరడింపుచున్నది. వసంతసేన వారి యొద్ద కరిగి సహజ దాక్షిణ్యము గలది కావున వారి యవస్థకు వగచుచు మగువలారా ! మీరేమి నేరముఁ జేసితిరి ? అయ్యో పాపము గుడువకునికి మీ ప్రాణములు కన్నులలో నున్న వికదా ఎన్ని దినములిట్లు పవాసములు చేయుదురు ? మిమ్మోదార్చు వారెవరు ? భగవంతునే వేడుకొనుచండవలయు నా జగద్రక్షకుఁడే రక్షింపపలయు విచారింపకుఁడని కన్నీరు గార్చునాఁ జల్లని మాటలచే వారి నోదార్చెనది. అమ్మతోసమానంబులగు నా మెసల్లాపంబులఁ దమసంతాపము కొంత చల్లార నందుఁగూర్చుండియున్న చిన్నది అమ్మా ! యిటువంటి చల్లని మాటలు విని యెన్ని దినములై నదో కదా. తప్పుచేసి శిక్షింపఁబడితిమేని దుఃఖమే లేకపోవును. తొలి జన్మమునఁ జేసిన యపరాధమునకు దైవము మమ్మిప్పుడు శిక్షింపుచున్నాఁడు నీవు గడునిల్లాలవువలెఁ గనబడుచున్నావు. మా దంత నీతో చెప్పుకొంటిమేని కొంత తఱగగలదు. తల్లీ నిరపరాధులము మమ్ము శిక్షించినారు. ఈమె మహా పతివ్రత యీమె నిర్దోషురాలని యెఱింగి నిజముఁ జెప్పినందుకు నన్నుఁగూడ శిక్షించిరి. అధికారుల న్యాయమెట్లున్నదో జూడుమని తాను రేవానగరము సేరినది మొదలు శిక్షింపఁబడువఱకు జరిగిన కథయంతయుఁ బూసగ్రుచ్చినట్లు తెలియజేసినది. అపరాధులని యెఱింగినప్పుడే పరితపించెడు నా యిల్లాలు వారు నిర్దోషురాండ్రని యెఱింగిన పిమ్మట నెట్టి పరితాపముఁ జెందునో చదువరులే యూహించుకొనవలెను.

అప్పుడత్యంత దుఃఖాక్రాంత స్వాంతయై వసంతసేన యా యింతిని దన రెండు చేతులతో లేవనెత్తి కన్నీరు దుడుచుచు తల్లీ ! మహిళామణీ ! తొల్లి చంద్రమతియుఁ సీతయుఁ ద్రౌపదియు నెంతెంతలేసి యిడుమలం గుడిచిరో వినియుంటివా ? తఱచు పతివ్రతలకే వెతలెక్కుడు గలుగుచుండును. విచారింపకుము. నా భర్త కడు మంచివారు ఆయనతోఁ జెప్పి సాధ్యమైనంత యుపకారము గావించెద. మా యింట భుజింతువుగాని రమ్ము. అయ్యో ! కుందనమువంటి నీ దేహ ముపవాసముచే నెట్లు కృశించి వాడినదో ? నీ పతియెవ్వఁడు ?

భవద్వియోగంబున నెంత చింతించుచున్నాఁడో కదా యని యడిగినఁ ----- అమ్మా! ఆచరిత్రమంతయు భారతమంత యున్నది. క్రమంబున నీకుఁ జెప్పక యేమిచేయుదుము ? మా యాత్రముడిగింప నీకు భారమని పలికినది. అప్పుడు వసంతసేన ఆమె నింటిలోనికిఁ దీసికొనిపోవఁ బ్రయత్నించినది. కాని పరిచారకు లయ్యగారికిఁ జెప్పికాని తీసికొనిపోఁగూడదని మనవి చేసికొనిరి.