పుట:కాశీమజిలీకథలు -04.pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

264

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

చినఁ గలిసి యిందుందురుగదా ! అట్లుకాక యెఱిఁగి వారి భర్తలిచ్చట కరుదెంచిన రానిత్తురాయని యడిగిన నవ్వుచు నతండిట్లనియె.

జాతియాభిమానము పోనిచ్చితివి కావు. మగనాలులై ననేమి ఘోరకృత్యము చేసి శిక్షింపబడిన నట్టివారిని మగలేల యనుమతింతురు. అనుమతించి వచ్చిరేనిపిమ్మట మా యిష్టము. స్త్రీ నిమిత్తము నిరపరాధులనుఁ గూడ శిక్షింతురాయని పలికిన విని యక్కలికి నాధా నేను జారకృత్యముల శిక్షింపబడినవారి మాటఁ జెప్పలేదు. ప్రమాద వశంబున నేదియేని యపరాధము జేసి శిక్షింపఁబడిన వారి విషయమై చెప్పితిపోనిండు, నాకాయాడు వాండ్రం జూపెదరా ? వారి మాట వినిన జాలియగుచున్నదని పలికిన నతండు రేపు ప్రొద్దున నుద్యానవనములోనికిం బోయిన గానిపింతురు. నీ కిష్టమేని జూపింతునని చెప్పెను.

ఇంతలో నొక పరిచారకుఁడు వచ్చి "అయ్యా ! సుల్తానుగా రెద్దియో చీటిని పంపినారు. తీసికొనిరానా" యని యడిగినఁ దత్తరముతోఁ దెమ్ము తెమ్మని వానింబంపి సుల్తానుగారిప్పుడు చీటి పంపుట కవసరమేమి వచ్చినది చెప్పుమా యని యాలోచించుచుండెను. ఆ లోపునా భృత్యుఁడా చీటిందెచ్చి యిచ్చెను. ఎడమ చేతితో విప్పి భార్య దాపుగా దీపము చూపుచుండ నా చీటిం జదివి మఱల నా భృత్యుని కిచ్చి “సరే చూచితిమని యా చీటి దెచ్చినవానితో చెప్పి పొమ్మనుము " అని చెప్పి యం పెను.

అప్పుడు వసంత సేన ప్రాణేశ్వరా ! ఆ యుత్తరములో నున్న విశేష మేమని యడిగిన నతండు మఱేమియును లేదు. నాతో నత్యంతావసరముగా మాట్లాడ వలసిన పని యున్నదట. రేపు సూర్యోదయము కాక పూర్వము వచ్చి చూడవలయు నని వ్రాసిరి శిక్షితులగు హిందువుల గుఱించి యడుగుటకని తలంచెదనని చెప్పిన నట్లైన నంతయవసరమైన పనియని యేల వ్రాయును ? వే రెద్దియో కారణమున్నదని యామె చెప్పినది. పోనిమ్ము . రేపన్నియుం దెలియను గదా యని వరుణదత్తుం డుత్తరము చెప్పెను.

వరుణదత్తుండు భుజించి లేచి వేగమ పండుకొని మఱునాఁడు సూర్యోదయము కాకమున్నే బండియెక్కి సుల్తానుగారి యాస్థానమున కరిగెను వసంతసేనయు రాత్రి యంతయు నా వ్రాత గుఱించి చింతించుచు మఱునాఁ డుదయంబునఁ గాల కృత్యంబులు దీర్చికొని పుష్పహాసుం డెద్దియో పనిమీఁద నుండుటచే వైశ్యాంగనల నిరువుర మాత్రము వెంటఁబెట్టుకొని పరిచారకులు దారిజూప నుద్యానవనమునకుం బోయినది.

అమ్మగారు వచ్చుచున్నారని విని యందుగల భృత్యు ------- వచ్చి అమ్మా ! యే మూలకుఁ బోవుదురని యడిగిన నామె నిన్న వచ్చిన యాఁడువాం డెందున్నవారో యచ్చటికిఁ దీసికొని పొండని చెప్పిన వాండ్రు అమ్మా ! పాపమా