పుట:కాశీమజిలీకథలు -04.pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వసంతసేన కథ

263

కుపాయ మాలోచించు చుండెను. అమ్మరునాఁడు వరుణదత్తుడు ద్వీపాంతరము నుండి వచ్చిన యపరాధుల దీసికొని వచ్చుటకై యోడల రేవు నొద్దకుంబోయెను. అప్పుడొక గుర్రపుబండి యెక్కించి యీ మువ్వురను పట్టణము చూచి రమ్మని వసంతసేన యంపినది ఆ బండివాడు క్రొత్త వాడగుటచే గమ్యాగమ్యస్థానము లెరుగంక సుల్తానుగారి మేడవీధిం దోలికొనిపోయెను. హిందూ సుందరులకు ముసుంగు వైచుకొను వాడుకలేదు. వారు పట్టణ విశేషంబులంజూచు తలంపుతో నా శకటగవాక్షంబులన్నియుఁ దెరచి కూర్చుండిరి. నాఁడు చిన్నసుల్తాను దైవికముగా నా వీధిలో బంతులాడుచు నా చేడియల వీక్షించెను. మఱియు నతం డాబండిదాపునకు వచ్చి యందున్న వారెవ్వరని వారలడగిన బండి వాఁడు వరుణదత్తుగారి బంధువులని యుత్తరము చెప్పెను.

అప్పుడు స్త్రీ వేషముతో నున్న పుష్పహాసుఁడు తిర్యక్ప్రసారితవక్త్రుండై యా బండిలోనుండి రాజపుత్రుం జూచెను. మగువలకుఁ బోలె మగవారికి లజ్జా విభ్రమంబు లెట్లు సహజంబులై యుండెడివి ? తదీయముఖచంద్ర బింబము జిన్న సుల్తాను గారి చూపు గల్వలను వికసింపఁజేసినది. జగన్మోహనం బగు తద్రూపంబు మహర్షుల నైన మోహవివశులం జేయుననుచో నొక యవన యౌవన పురుషుని వలపించినదనుట యేమి యబ్బురము ? రాచపట్టి చూపులాబండి ననుసరించియె పెద్దదూరము పోయినవి. పుష్పహాసుని విలోకన విలాసములు యవన కులావతంసుని హృదయ శకుంతమునకు వితంసములై తగిలికొనినవి.

అట్లు పట్టణమంతయుఁ ద్రిప్పి బండివాఁడు సాయంకాలమునకు వారినింటికిం దీసుకొనివచ్చెను. పుష్పహాసుఁడును బండిదిగి వసంతసేనతో వారు చూచివచ్చిన విశేషము లన్నియుం జెప్పుచుండ నింతలో సముద్ర తీరమునుండి యయ్యగారు వచ్చినారని పరిచారకు ఆమెకుఁ దెలియజేసిరి.

అప్పుడు కొంచెము చీఁకటి పడినదిగావున వసంతసేన వాడుక ప్రకారము స్నానము చేయుటకై భర్తకు వేడినీళ్ళు సిద్దపఱపించినది. వరుణదత్తుఁడు దుస్తులన్నియుదీఁసి పెరటిలోనికి వచ్చి స్నానము చేసి భోజనము చేయుచున్న సమయంబున వసంతసేన దాపున నిలువంబడి తాళవృంతముతో విసరుచు నేఁటి విశేషములేమని యడిగిన నతం డిట్లనియె విశేషముల కేమియున్నది. యెక్కడఁ జూచినను స్త్రీ సాహసమే విశేషముగాఁ గనంబడుచున్నది. ఇరువురు స్త్రీ లొక రత్నవర్తకునిం బరి మార్చిరఁట ? వారికి ద్వీపాంతరవాసశిక్ష విధించిరి. వారిం జూడఁ యున్నవారు. ఇట్టి సాహసమున కెట్లు పూనికొనిరో తెలియదు పనులు beg is? అన్నది చాల మణిమ సుందర పురు.... . . . . ... త, ఆ పర్మింపలేడు. వీను తప్పున ములు : సీపము 4 . M...న్నారని విప్పగా ..... : సం.....? 3. విరలంత విడారెంపుముందు వారి.. 'ఎం పాటు తిష విధం . కారం .