పుట:కాశీమజిలీకథలు -04.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

ముతో శుభముహూర్తంబున నన్నాతనికిచ్చి వివాహముఁ గావించిరి. అతండే నా భర్త.

నే నట్లనుకూలవాల్ల భ్యంబు లభించుటచేఁ బరమ సంతోషముజెందుచు నీయనతో సకల సౌఖ్యముల ననుభవించుచుంటిని నా భర్త మిగుల దయాళుండు సౌజన్య నిధి. సుగుణాకరుండని చెప్పఁగలను వినుండు. హిందూ దేశమున ద్వీపాంతరవాస శిక్ష విధింపఁబడినవారి నీ దీవికిఁ బంపుచుందురు. అట్టివారిం బట్టుకొని యిక్కడి యవనులు పశువులం బోలె బాధించుచుఁ బనులు సేయించుచుందురు. అది యంతయుం జూచి నా భర్త యట్టివారిం బనులు సేయించుటకుఁ దనకధికారమిమ్మని మజ్జనక ముఖముగా సుల్తానుగారిం గోరికొనియెను. సుల్తాను మా తండ్రి మాటలకు జవదాటఁడు కావున నట్టియుద్యోగ మప్పుడే యిచ్చెను. నా తలిదండ్రులు కొలఁదికాలము క్రిందనే నాక మలంకరించిరి.

నాటంగోలె నా భర్త యా యుద్యోగము చేయుచున్నారు. నెల కొకసారి యోడ రేవునకుంబోయి మీ దేశమునుండి వచ్చిన యపరాధుల విమర్శించి తీసికొని వచ్చి నేరము ననుసరించి శక్యమయిన పనులం జెప్పి కాపాడుచుందురు.

ప్రమాదవశంబున నెవ్వరేని యన్యాయముగ శిక్షింపఁబడిరని తెలిసినచో నట్టివారిని విడుచుటకు సైతము సుల్తానుగా రాయన కధికార మిచ్చియున్నారు. మన పెరటినంటియున్న పొలములోనే పుష్పజాతులు మొక్కలు వేన వేలు వేయించి యట్టివారిచేతనే యందుఁబనులు చేయించుచుందురు.

మీరు తొల్తనే యప్పుణ్యాత్ముని కంటఁబడిరి. కావుననే యిక్కట్టు నెఱుంగక మా యింటికి వచ్చితిరి లేనిచో మిమ్మీ యవనులెల్ల చిక్కులు పెట్టుదురు. మీ శీలములఁ జెరుపకుందురాయని యావిడ యా వృత్తాంత మంతయుం జెప్పినది.

అమ్మా ! నా కిచ్చటికి వచ్చినది మొదలు గలిగిన సందియమును భోగొట్టితివి. మీ వేషములు నలంకారములు చూడ యవనులం బోలియున్నవి. ఆచారము హిందూమతానుసారముగా నున్నది. మొదట నేను నీ భర్తంజూచి యవనుఁడే యనుకొంటిని. మా దేశములో దురకలు గాని గడ్డము పెంచుకొనరు. ఇక్కడ భుజించుటకే సంశయము పడితిని అన్ని సంశయములు తీర్చితివి. నీవు కడునిల్లాలవు. భర్త నెక్కుడుగా నతిధుల నాదరింపుచున్నావని స్తుతిజేయుచు నమ్మా ! మాకీ పట్టణము చూడవలయునని యున్నది. సహాయము నెవ్వరినైన నిచ్చి పంపరా ! మా దేశములో నిన్నెల్ల కాలము చెప్పుకొనుచుందుమని కోరిన నామె యిట్లనియె

యువతీ ! నా భర్త యోడలరేవునకు రేపు పోపుదురు. అప్పుడు మీరొక బండిమీఁద పోయి పురము చూచివత్తురుగాక. ఆయన వినిన సమ్మతింపరని చెప్పినది. పుష్పహాసుండు తాను స్త్రీ వేషమున నుండుటకు వగచుచుఁ బురుషుఁడుగా మారుట