పుట:కాశీమజిలీకథలు -04.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

33]

వజ్రమాల కథ

257

నాకు సహవాసముగా నుండును. ఇది తప్పుగా గణించవుగదా : యని చెప్పిన నామెనవ్వుచు నిట్లనియె.

పుత్రీ ! మంచిపనియే చేసితివి. కాని యిన్నివస్తువులతో నీ చిన్నదానిని దానివారలు లేకుండ విదేశమునకుఁ దీసికొనిపోవుటకు గొంచె మాలోచింపవలసి యున్నది. కానిమ్ము. సమ్మతించి యుంచితివిగదా. దీన మనము పడియెడు శ్రమ యేమి యున్నదని యనుమోదించినది.

అమ్మ ఱునాఁడు నక్షత్రము మంచిదికాకపోవుటచే వారికాదివసము రాత్రియే ప్రయాణము సేయక తప్పినదిగాదు. దానంజేసి వజ్రమాలకు నాఁటిరేయి పుష్పహాసునితోఁ గూడ సంకల్పించిన ప్రకార మా మేడలో వినోదింపఁ దటస్థించినదికాదు. నావికుల రప్పించి భోజన సామాగ్రియుం బఱుపులు మందసములులోనగు వస్తువులెల్ల బండ్ల మీఁద బంపి వారు మువ్వురు నొక బండిలోఁ గూర్చుండి యోడ యొద్ద కరిగిరి.

రాజభటులు వచ్చి వారిం బరీక్షించి యాఁడువాండ్రగుట విడిచి పెట్టిరి ప్రవహణ మెక్కినతోడనే నావికులు మంచిగాలి విసరుచున్నది కావునఁ దెరచాపలె త్తి యోడను విడిచిరి. అదియు నా సముద్రములో వాయువేగముగా నడువఁజొచ్చినది. ఆ యోడంత పెద్దదికాకపోవుటచేత వజ్రమాల తలచుకొనినప్రకార మందు స్వేచ్ఛగా వానితో వినోదించుటకు వీలుపడినదికాదు.

ఆ యోడలోఁ బుష్పహాసుఁ డెప్పటికప్పు డేదియో మిషపన్ని వజ్రమాల కొలఁదిగా దొరకక తప్పించుకొని తిరుగుచుండెను. ఆ ప్రవహణంబు మంచిగాలి విసరుటచే బదిదినము లహోరాత్రములు చాలాదూరము పోయినది. ఇఁక రెండు మూడు దినములలో రేవుచేరునని నావికులు సంతసించుచుండ నా గాలియాగి వినిమయ పాతంబు వీవఁజొచ్చినది. అప్పడానౌక యటుపోక రెండవదెసకరుగఁ జొచ్చుట ------- నావికులు భయపడుచుఁ దెరచాపలు ------------ సాధనంబులన్ని తొంటిదెసకు నడిపింపఁజూచిరిగాని వారి ప్రయత్న మేమియుఁ గొనసాగినదికాదు.

ఆ ప్రతికూలవాతంబు గ్రమక్రమంబునఁబలిసి విసరుచుండుటయు నత్తఱిక త్తరి వాహకులు తత్తరమందుచు తెరచాపలుదింపుటకుఁ బ్రయత్నముచేయు చుండ నింతలో గాలివానబట్టి యా యోడ యట్టిట్టు కొట్టుకొనుచు మునుఁగుటకు సిద్దపడినది. అప్పుడు నావికులు నిష్ప్రయత్నులై దైవమును బ్రార్థింపుచుండిరి. అప్పుడా నౌక మునుఁగక దైవవశంబున నొక గాలివిసరున నొకదీవికిఁ గొట్టుకొనిపోయి యందున్న పర్వతమునకుఁ దగిలి నూఱువ్రక్కలగుటయు నందున్న వారు ప్రాణా --- యొడ్డునంబడుట దర్ఘటమైనది.

వజ్రమాలయుఁ దల్లియుఁ బుష్పహాసుఁడు ... ఆ నది యే మనము ఆయన నాడు ఇం సము. సచికాదు.