పుట:కాశీమజిలీకథలు -04.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

256

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మేల్కొనునేమో యని పెద్దగా రొదచేయుచు నిట్టూర్పులు నిగుడింపుచు బలువెతలం గుడుచుచుండ నింతలోఁ గోడికూత వినంబడినది.

అప్పు డప్పడతి యా యింటితలుపులు మూసి తల్లి యొద్ద కరిగి పండుకొన్నది. తల్లి యు నవ్వుచు అమ్మా ! కలలో నీ మనోహరుఁడు గనంబడెనా ? యెంత బేలవోగదా! అంత యేలవచ్చినది ? మనము పోవుదము రమ్ము. వారు రమ్మని యిదివఱకే వార్తల నంపిరిగదా. రేపు మనయోడ నొకటి పయనము జేయింపుఁ డని నావికుల కాజ్ఞాపించెదనని పలుకుచు నోదార్చినది. ఆ మాటలేమియు నా బోటికి చెవికెక్కలేదు. అత్తరుణి మఱల మధ్యాహ్న ముపహారములం గొని యా మేడకుఁ బోయి యాతనికిచ్చుచు సుందరుఁడా ! నీ వంటి రసికు నెందును జూడలేదు. రాత్రి నన్ను సంగీతము పాడుమని నిద్రఁబోయెదవా ? చాలు చాలు నేనెంతో ముచ్చటపడి మంచిరాగము లాలాపించితినే ! నా మగనికన్న వెక్కువవాఁడవలె నుంటివని యించుక యలుకతోఁ బలికిన నా చతురుండు మందస్మితము సేయుచు సిట్ల నియె.

సాధ్వీ ! నాకుఁ బదిదినములనుండి నిద్రలేదు. అదియునుంగాక “దుఃభీతే మనసి సర్వమసహ్యం" అను నార్యోక్తి వినియుందువుగదా ? నా వెఱపు నీ కేమి యెఱుక ! నన్నెట్ల యిన నమరావతికిఁ దీసికొనిపోవుదువేని నా చాతుర్య మక్కడఁ జూతువుగాని మఱియు నాకు వ్యాధి బాధింపుచున్నది. ఇట్టిస్థితిలో నీ సంగీతము నాకు రుచించునా ? యని పలికిన విని యజ్జవరాలు నవ్వుచు నిట్లనియె.

నిన్ను ఫాలాక్షుఁడు చూడలేదు. నిర్భయముగా నుండుమని యభయహస్త మిచ్చి యుండలేదా ? ఊరక వెఱచెదవెవ్వరికి ? అమరావతీ ప్రయాణము సిద్ధమయ్యే యున్నది. నీ మది సంతసించినం జాలునని పలికిన నతం డిట్ల నియె.

సఖీమణీ ! నన్నుఁబట్టుకొనుటకై రాజభటు లెల్లెడలఁ గడు ప్రయత్నముతోఁ దిరుగుచున్నారు. వెనుక నోడలోఁ గూర్చుండగనే పట్టుకొనిరి. కావున నేనీ రూపు మార్చి స్త్రీ వేషము వైచుకొని మీతో వచ్చెదను. అట్లయిన బరీక్షించుట కవకాశ ముండదు. నీకునుం దప్పునుండదని పలికిన సంతసించుచు నయ్యంతి భళిలే ! మంచి యూహ చేసితివి. దానం బెక్కులాభము లున్నయవి. అని యుబ్బుచు ---------------- యప్పుడే వానికిఁ దలదువ్వి జడవైచి చీరఁగట్టి నగలువెట్టి యద్దము జూపినది. అతండు తన రూప మద్దములోఁ జూచుకొని మిక్కిలి వెరగుపడఁజొచ్చెను. జగన్మోహినివలె నున్న యతని స్త్రీ వేషమునుజూచి వజ్రమాలయు సిగ్గుపడఁజొచ్చినది. దరచు పురుషులకు వ్యత్యయ వేషములు వైచికొనినప్పుడు క్రొత్తయందము ------------- వజ్రమాల యతని దల్లి యొద్దుకుఁ దీసికొనిపోయి అమ్మా ! ఈ నదులు ..వరు -- (తుపట. దీని ధర యమకావు : న్న.....! పుదుము. తెలు ది..తం - అని. వచ్చ లేనప్పుడు..... గృహకాగ్యములు చక్కగట్టుక పడింది. నలు, పులు.. ము...