పుట:కాశీమజిలీకథలు -04.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వజ్రమాల కథ

255

పుష్ప - పోనిమ్ము కొక్కోకము కంఠస్థముగా నున్నదియా ?

వజ్ర - (ముఱియుచు) తలక్రిందుగా నేకరువు పెట్టగలను.

పుష్ప - అందుఁ బండ్రెండవ పరిచ్చేదము నీకు జ్ఞాపకముగా నున్న దియా ?

వజ్ర - (నవ్వుచు) ఓహో ? పదియేను పరిచ్ఛేదములుండ నీ కది దొరికినదా ? మంచి రసికుండవే. అది స్ఫుటముగానే యున్నది. దానిలో నేమి యడిగెదవు ?

పుష్ప - పదవ శ్లోకము చదువుము.

వజ్రమాల – నాకు రాదనుకొంటిరాయేమి ? వినుఁడు.

శ్లో॥గతిపతి దయితేతు క్వాపి మాంగళ్య మాత్రా
    ణ్యపచిత గురువిప్రా ధారయే స్మండనాని
    అనవసిత విధానె తస్యనిర్వాహయత్నం
    వ్రతనియమ విధించ క్షేమసి ద్యైవిదధ్యాత్.

ఇదియేనా ?

పుష్ప -- అగు నందలి తాత్పర్యమేమియో చెప్పుము.

వజ్ర — భర్త గ్రామాంతర మరిగినప్పుడు భార్య మంగళసూత్రములో నగు ప్రధానవస్తువులు మాత్రమే ధరింపవలసినది కాని యితరాలంకారము లేమియు ధరింపఁగూడదు. మరియు గురువిప్రాదుల సేవింపుచు నతని క్షేమముకొఱకు వ్రతములు చేయుచుండవలయు.

పుష్ప - మఱి నీవట్లు చేయుచుంటివా ?

వజ్ర - అమ్మకచెల్లా ! నన్నాక్షేపించుటకా యీ పరీక్ష : తెలిసికొనలేక బోయితినిగదా.

పుష్ప - నాకిప్పుడు మనస్సు కొంచెము వ్యాకులముగానున్నది. భవదీయ గాంధర్వ పరిశ్రమంబు దేటపడ వీణాగానరసం బించుక చెవులఁ జిలికించి యానందము గలుగఁ జేయుము.

వజ్ర - ఈసారి మంచిదారికి వచ్చితివి. అని సారెలు సవరించి వీణం జేతఁబూని మనోహరముగా సంగీతము పాడుచున్నది.

అప్పుడు పుష్పహాసుండు పీఠమున జేరఁబడి. . . . . inurme 'ఆ చిన్నది ఆహ్య : ఏనికి ఈ త్వమే . తను న్నది . మంత శ్రీనుండైన - - - - - - ... : సిన నీరు ..... దిల్లిన మంత . . . కాకతి పోలు లంచుచు నాతండు రంగా అము.....