పుట:కాశీమజిలీకథలు -04.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

వజ్రమాల కథ

253

చెదఁ గాక. యని తలంచి తరుణీమణీ ! నే నొక బాటసారిని నన్నన్యాయముగ రాజ భటులు పట్టుకొనఁ జూచినఁ దప్పించుకొని పారిపోయి వచ్చితిని. నా యుదంత మంతయు ముందు వివరించెదను. మా యింట దాచి మీరు పోవునపుడు నన్నుఁ గూడ నమరావతీ పురంబునకుఁ దీసికొని పోవుఁడు అది యే నా కోరిక యని చెప్పెను.

1 . . . . . . . . . ) అమ్యం నా జవ్వసము నేటి సాగును . "మ " అన్నది. ఆ ) 13. సువచ్చి నరంటట సినది. అమ్మక గు, మ్య సం .. చుర న్మకు స్వర్గమ్మదియేల? ము...... , సున్నము గలడు . . ్వళ్ళూరు సుసం తో నా వగ - తు. "పు త. . . గిం ను ముపుమడ.3 దీనికి నన్నింత బ్రతిమాల వలయునా ? నా హృదయంబునం బెట్టుకొని నిన్నుఁ గాపాడెద మా యింటనున్న ఫాలాక్షుండైనఁ దెలిసికొనఁగలఁడా ? ఆ సౌధంబు లన్నియు మా యవియే సుమీ, లోపలికి బోవుదము రమ్ము. పరిచారకులై నం జూడఁ గూడదని పలుకుచు నతని చేయిపట్టుకొని మారు దారి నొక మేఁడమీఁదికి తీసికొనిపోయి కూర్చుండఁ బెట్టినది.

అంతలో రాజభటులు వచ్చి వాఁకిట నిలిచి తలుపులు తట్టుచు గేకలు వైచిరి ఆ రొద విని వజ్రమాల యామేడ దిగి తల్లి యొద్దకు వచ్చినది. అప్పుడు పరిచారకులు వచ్చి రాజభటులు మన యిల్లు పరీక్షింతురఁట. ఎవ్వఁడో దొంగ యొకఁ డీవైపునకుఁ బారిపోయి వచ్చెనఁట. తలుపులు తీయుమనుచున్నా రని పలికిన విని వజ్రమాల వానికిఁ గొంత లంచము పంపి యిందాఁడువారు కాక మఱియెవ్వరునులేరు. మేమంతయుం జూచి వచ్చితిమని చెప్పుఁడని పరిచారకులకు బోధించి యంపినది. రాజ భటు లాపరిచారకు లిచ్చిన లంచముకొని సంతసించుచు నా యిల్లు పరీక్షింపక యవ్వలికిం బోయిరి. అప్పుడు వజ్రమాల బ్రహ్మర్షసాగరమున మునుంగుచు నాఁడుకాంచన మణి భూషాంబర విశేషంబులం దాల్చి యచ్చర మచ్చెకంటి తెఱఁగున మెఱయుచు నుపహారంబులఁ బెక్కుగై కొని అమ్మా ! నేఁడు నేనా క్రీడాసౌధంబునం బండుకొనియెదను. పిలువకుమని చెప్పిన విని యమ్మగువ బాగు బాగు ! నీ మగఁడూర లేడుగదా. యొంటివై నీవా మేడం బండుకొనుటకు, గారణమేమి ! నేఁడు సింగార మేమిటికి సేసితివని యడిగిన బుడి బుడి దుఃఖం బభినయించుచు నమ్మించుఁబోడి తల్లి కిట్ల నియె.

అమ్మా ! నీతో జెప్పక దాచనేల ? రాత్రి నా మనోహరునితో గ్రీడింపు చున్నట్లు కల వచ్చినది మధ్యను మెలకువ వచ్చుటచే నప్పటి నుండియు నా మనంబున నెట్లో యున్నది. నేఁడు సౌధంబున నా తల్పంబునఁ బండుకొని తత్ప్రతికృతిం జూచుచు నిద్రించితి నేని స్వప్న శేషంబు పొడగట్టి శేషించిన క్రీడావిశేషంబు ఫలం బనుభవింపఁగలదాననేమో యని భ్రాంతిపడుచు నిప్పనికిఁ బూనుకొంటిఁ దెలిసినదా ? యూరక కుశంకలు చేయుదువని పలికిస విని యా యిల్లాలు నల్లుండు దేశాంతరమఱిగి