పుట:కాశీమజిలీకథలు -04.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

29

లవంగి - అసాధ్యుండని మెల్లగాఁజెప్పెదవేమి? అమ్మయ్యో? అతఁడు నాచేయి పట్టుకొనినప్పుడు వణకువచ్చినది. చూచితిరా? మన మాఁడువాండ్రుమైనట్టు అనుమానము జెందినాఁడు సుఁడీ?

కుంద - అవును. నీసుముఖత్వము మనోహరముగా నున్నదన్నమాట యూరక పలికినదికాదు.

లవంగి – అదియునుంగాక నేను మఱచిపోయి స్తుతిశ్లోకములలో పతితాం అని స్త్రీలింగవిశేషణము వైచితిని. దానికేగదా యతండు శంకించెను.

సంగీతచంద్రిక – నీవాయనతోఁ బ్రసంగించితివిగదా. విద్యలలో నేపాటి వాఁడు!

లవంగి - విద్యలలో బృహస్పతియే యని చెప్పవలయు. నేనన్నిటిలో నూపి చూచితిని. నిర్లక్ష్యముగాఁ జెప్పివిడిచెను.

కుంద - వాని రూపము మిక్కిలి మనోహరముగా నున్నది సుమీ. వాని రంగు నీరంగు నొక్కసమముగా నున్నవి.

లవంగి - రంగుమాట యటుండనిమ్ము. నుదురు సౌరుఁజెక్కుల తళ్కు గన్నులయందము నెట్లున్నవో చూచితివా ?

సంగీత - అతండు నవ్వుచుండ మొగ మూరక చూడముచ్చటయైనదిగదా. ఆహా! పలువరుస యాణిముత్తియములు గ్రుచ్చినట్లే యున్నది

లవంగి - పెక్కేల యావిప్రకుమారుండు యువతీమన్మథుండని జెప్పఁ దగినదియే.

సంగీత - అట్టి మనోహరుండు నీకు లభించిన మేము సంతసింతుము.

లవంగి - అతని కాతఁడే సాటి. అట్టివాఁడు మఱియొకఁడుండి నప్పుడు గదా.

కుంద — ఆతఁడే విశ్వేశ్వరసాక్షిగా నీపాణిగ్రహణము గావించెనే!

లవంగి – దాన నేమి యయ్యెను?

కుంద - ఏమికావలయునో యదియే కాఁగలదు.

లవంగి - అది పరిహాసజల్పితమా యేమి?

కుంద -- పరిహాసమేమి? నీయభీష్ట మెట్లో యట్లే కావింతము మాయొద్ద మోమోట మందెదవేల?

లవంగి - సఖీ! అది యేమియోకాని వానింజూచినది మొదలు నా హృదయమున నేదియో వికారముగలిగి బాధించుచున్న దేమి?

సంగీత - మేమదియే యనుకొనుచుంటిమి యుక్తమే.

లవంగి - అన్నా! వాని కులశీలనామంబు లేమియుం దెలియవు. అట్టి