పుట:కాశీమజిలీకథలు -04.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలిశెట్టి కథ

243

నేరము చేయలేదు. సెట్టి నిది చంపలేదు. అంతయు నాకుఁ దెలియును, దైవముఖమున నిజము సెప్పెదను.

చమూ - అరే భాంబోత్ దీనికి యెవ్వరు బే

ఆర్య - అది యెవ్వరో నే నెఱుగనండి.

చమూ - నీకీ నిజము యెట్లు సెప్పఁగలవు ?

తిలక - నేను గన్నులార జూచితిని. అని తాను రావిచెట్టు మొదటఁ గూర్చుండినది. మొదలు నాఁటి తుదవఱకు జరిగిన కథ యంతయుం జెప్పినది.

అప్పుడా చమూపతి యార్యభట్టుగారి యిల్లు పరీక్ష చేయుటకై నిరువురి రాజభటులం బంపెను. వారాయిల్లు శోధించి యందు శెట్టి వ్రాసిన యు త్తరమును శెట్టి పంపిన రవ్వలజతయుం బట్టుకొని యప్పిని రామాభాయిని వెంటబెట్టుకొని చమూపతి యొద్దకరిగి యా వృత్తాంతమంతయు జెప్పిరి. చమూపతి యా యుత్తరమిట్లు చదువుచున్నాఁడు.

నీవు కోరిన ప్రకారము రవ్వలజత యిందుతోఁ బంపించితిని. నా మనోరథము తీరుతువేని పిమ్మట నా యౌదార్యము చూతువు గాక ! నాకిదియొక లెక్కా ! క్షణమొక యుగము లాగున్నది. ఆలస్యము చేసితివేని ప్రాణములు నిలువవు. సాంకేతిక మేర్పరచి వెంటనే ప్రత్యుత్తరము వ్రాయఁగోరెదను.

ఇట్లు నీదాసుఁడు రత్నాల పోలిశెట్టి.

అని చదివి చమూపతి గడ్డముఁ దువ్వుకొనుచు అరే భాంచోత్ దీనికి కోమటికి యెవ్వరికి వ్రాసినది తెలియదేమి. తల పంకించుచు రామాభాయిం జూచి దీనికి యెవ్వఁడు అని యడిగిన నార్యభట్టు అది నా భార్యయని యుత్తరము సెప్పెను.

చమూ – అరే భాంచేత్ దానికీ అడిగితే నీకి సెప్పుదావేమీ ఉరుకో. నీకి యీ చీటి కోమటి వ్రాసినాడా ?

రామా - లేదండి మహాప్రబో. లేదండి.

చమూ - దీనికి మీ యింటి కేలాగు వచ్చినది.

రామా - ఈ మహిళామణి మా యింటిలో నుండఁగా వాఁడు చూచినాఁడు కాఁబోలును దానికి వ్రాసినాఁడు నాకేమియు దెలియదండి.

చమూ - నీకి దీనికి గుడికి పంపినావని యీ యాఁడది సెప్పుతోంది నిజమేనా?

రామా - వట్టిదండి. నా కేమియుం దెలియదు. దీనికి నామీఁద గిట్టక చెప్పుచున్నది. ఇది అది వకటేనండి. అప్పుడప్పుడు మా యింటికి వచ్చుచుండ నేమిటికో యనుకొంటినని యారామాభాయి యంతకుముందచ్చట జరిగిన సంగతులన్నియు రహస్యముగా నప్పినిబంపి తెలిసికొన్నది గావున సందర్భానుసారముగా బొంకి యా