పుట:కాశీమజిలీకథలు -04.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

242

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అక్కయా ! చెల్లె యా ! యేమో అన్నగారప్పగించినారుగదాయని నాలుగు దినము లన్నము పెట్టితిమి. ఆగొడవలన్నియు మనకేలనని వారించినది.

అప్పు డార్యభట్టు అమ్మీ ! నీవెవ్వతెవు ? దానితో నీకీ చుట్టరికమెక్కడఁ గలిసినది? దానిపై నీకింత ప్రేమయేల గలుగవలయునని యడిఁగిన దిలక అయ్యగారూ ! ఆమె యెవ్వతియో నే నెఱుంగను. కాని నిర్దోషురాలని నిశ్చయముగాఁ జెప్పఁగలను. మొన్నను భుజించునప్పుడు మీయింటనే చూచితినని చెప్పుచుండగనే రాజభటుఁ డొకండువచ్చి యార్యభట్టుగా రిల్లి దియేనా యని యడిగెను. ఆమాట విని యతండు భయపడుచు అయ్యో ! మాకొంపయు మునింగినది. రాజదూతవచ్చి నా పేరడుగుచున్నాఁడు. ఏమిచేయుదును? ఎక్కడ దాగుదునని తలంచుచుండ నాకింకరుండు లోపలికి చ్చి బాపఁడా ! ఆర్యభట్టువు నీవేనా ? నిన్ను జదురునకుఁ దీసికొనిరమ్మని మాదండనాయకుఁ డాజ్ఞాపించెను. రమ్మనుటయుఁ దిలక అయ్యా ! తమకేమి భయము ? పదుండు నేనుఁగూడ వత్తునని చెప్పినది. అప్పుడు వారందరుఁ గలసి చావడి దగ్గరకుఁ బోయిరి. అతడు మహిళామణి యాచావడిలో నొకమూల దలవాల్చుకొని నిలువంబడియున్నది. చమూపతి ఆర్యభట్టుం జూచి యిట్లనియె.

చమూపతి - అరే ! బాపనాడా ! నీకీ యీఆడదీ యేమీ కావాలా ?

ఆర్య – మహాప్రభో ! నాకేమిన్ని కాదు.

చమూ - కాకపోతే మీకీ యింటిలో యెందుకూ వుండాలీది భాంచోతు.

ఆర్య - భాంచోతు మా యింట్లో యెప్పుడూ వుండలేదండి.

చమూ - అరే భాంబోతుకాదు. ఆడది మీకి యింట్లో యెందుకు వుండాలీవోయ్.

ఆర్య - అదాండి. మా అన్నగారు వరికుప్ప నూరిపించుచుండఁగా బ్రోగుగావేసిన గడ్డిలో వచ్చి యిది కూర్చున్నదట. అప్పు డా యన యింటికిఁ దీసికొని వచ్చి కొన్ని సంవత్సరములు తన దగ్గఱ నుంచుకొని చచ్చిపోవుచున్న సమయంబున నా కప్పగించి దీని యావజ్జీవము పోషించుమని చెప్పెను. అందు మూలమున దీనిని మా యింటిలో నుంచుకొన్నామండి.

చమూ - అరే భాంచోత్. దీనికి మీ అన్న గారికి వుంచుకున్న మనిషా నాకీ ఆలా సెప్పవేమి.

ఆర్య - వుంచుకోవడం అనగా తప్పుమాట కాదండి పెంచుకున్నారన్న మాట.

చమూ - ఇది ఇప్పుడు పెద్ద సెట్టికి పొట్టమీఁద సంపి మాట్లాడదేమి ? అరే భాంచోత్ యిది ఆగే సంభe an in ' సి : సంచరిసిన ముగ్గులు, సేసింది .

ఆర్య - ఇది యింటిదగ్గర దఱచు మాట్లాడేది కాదు.

తిలక - అయ్యా ! 1 : . మనవి యున్నది. ఆమె యేమియు