పుట:కాశీమజిలీకథలు -04.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలిసెట్టి కథ

235

అమ్మా ! భవానీ ! నీవు త్రిలోకవంద్యురాలవు నా యిచ్చిన యుపాహారములఁగైకొని మా యజమానురాలి తలనొప్పి పోఁగొట్టి యనుగ్రహింపుము: అమెకు సంతానము గలుగఁజేయుము. దేవీ ! భక్తజన వాత్సల్యమేపార మదీయచిత్తం బెప్పుడు పాతివ్రత్యగుణవిశిష్టంబై యుండునట్ల నుగ్రహింపఁ బ్రార్థించుచున్నాను. నన్ను నా వల్లభునితో నెప్పుడుగూర్తువో ? నిన్నే నమ్మియున్నాను. ఇదియే నీకుఁ బదివేల నమస్కారములు.

సెట్టి - (స్వ) అయ్యయ్యో ! నాపాలిట కీపాడుతేలెక్కడవచ్చినదో. కార్యము సిద్ధపడినప్పు డనుభవించుటకు యోగము లేకపోయినదిగదా. ఆహా ! అ మోహనాంగి మోమెంత వింతగానున్న దో యొక్కసారి ముద్దుఁగొనిన జన్మమునకుఁ జాలదా ? కానిమ్ము. ఎల్లుండి రాత్రి యెప్పుడు కన్నులబడునో.

మహిళ - అప్పీ ! ఈ లాగునరా ! అక్కడ నెవ్వరితో మాట్లాడు చున్నావు ? ఈ పాత్రలం గైకొనుము. వేగమింటికి బోవుదము. అర్థరాత్రమైనది.

అప్పి - చిత్తము. ఎవ్వరును లేరు. నాలో నేనే యేదియో పాడుకొనుచున్నాను. (అని పాత్రలం గైకొని ముందులాంతరు బుచ్చుకొని చూపుచు మహిళతో గూడ నిష్క్రమించినది).

అంతలో నరిసిగాఁడు తేలుమందుఁ తీసికొని వచ్చి బాబూ ! యెందున్నా రని పిలిచెను.

సెట్టి - యిదిగో యిక్కడున్నాను. మందు తెచ్చితివా ! అబ్బా నా ప్రాణములు పోవుచున్న విరా ? యింతదనుక యీ చిన్నది యున్నది. కావున బాధ కనుపించినదికాదు. ఇటురా ! నా భార్య లేవలేదుగద ?

నరసి - నేను పెట్టి తడుము చుండఁగా ఎవరు వారన యదరిపడి యమ్మగాఱు లేచిందండి.

సెట్టి - అది యెందుకని యడిగిందా యేమిటి ?

నరసి - అడిగినారు తేలు చెక్కకై వచ్చితిని. బాబుగారికి తేలుకుట్టిందని పొరపాటు చేత చెప్పినాను బాబూ !

సెట్టి - ఓరీ వెధవా ! యెంత తెలివి తక్కువ వాఁడవురా ! అమ్మవారి గుడి దగ్గర ఉన్నానని కూడ చెప్పినావా యేమి ?

నరసి - (తొందరపడి) ఆ మాటయుం జెప్పితిని బాబూ !

సెట్టి - అయ్యో ! యిక్కడికది రావడము లేదుగద ?

నరసి - తేలో పామో ! అని భయపడి అమ్మగారు బండి కట్టించుకొని వచ్చుచున్నారు బాబూ !

సెట్టి - యెంతదూరములో నున్నదిరా ? వెధవకాన  ?