పుట:కాశీమజిలీకథలు -04.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లవంగికథ

27

చారము కాదు. అది లేనిదే మేమేపనియుఁ జేయము. మమ్ముఁ బోనిండని వినయముగాఁ బ్రార్థించిరి. లవంగి యతండు తనపాణిగ్రహణము జేసినదిమొదలు వివశయై తదీయరూపలక్షణంబులు విస్మయముగఁ గలుగఁజేయ నతని మొగ మట్టెచూచుచుండెను. ఆబోటులమాటలు విని వీరుఁడు చేయివిడువక మీదేశాచారములు మాదేశమునం బనికిరావు. ఇష్టమగునేని నంగీలును దలపాగయుఁ దీసి లోపలకుఁ బొండు. లేనిచో నిందే నిలువుండు. అని మోమోట ముడిగి పలికెను.

అప్పుడు లవంగి చేయి విదళించుకొని యించుక వెనుకకుం జని యతని మొగముపైఁ జూపులు నెరయఁజేయుచు ధైర్యముతో 'అయ్యా ! నావేషము యవనవేషమువలె నున్నదని పలికితిరి. మీవేష మెట్లున్నది? మీరెవ్వరు? నన్నాక్షేపించి మీరిట్టివేషముతో నిందుంటిరేల? యని యడిగినది.

వీరుఁడు నేను బ్రాహ్మణకుమారుండను ద్వారమును గాచుచుంటిని. గాన నిట్టివేషము వైచికొంటిని. ఈవేషముతో లోపలకు బోవను.

లవంగి — అహో? భవదీయ విప్రత్వం, శాస్త్రాభ్యాసంవా, వేదపఠనంవా, ఉత యజ్ఞకరణంవా విశిష్యతే కింతేభ్యోత విప్రాణాం సేవకావృత్తి॥ మీబ్రాహ్మణత్వమంత కొనియాడఁదగియున్నది. ఇది శాస్త్రములు చదువుటా? లేక వేదము వర్ణించుటా? యజ్ఞములు చేయుటా? వానికంటె నిక్కడి బ్రాహ్మణులకు సేవకావృత్తియే యెక్కుడు కాబోలు అని గీర్వాణభాషతో నాక్షేపించినది.

వీరుఁడు - శాస్త్రేమవా నేదేషువా పరిచయోస్తికింభవతో యస్మిన్ కస్మి న్మాం పృచ్చం నాహం సేవకః వీరోహం యవనపుత్రికాప్రవేశభయా దేవతాలయ ద్వారం రక్షామి॥ మీరు శాస్త్రముల యందైనఁ వేదమందైనఁ బరిచయము గలిగియున్న యెడల మీ యిష్టమువచ్చినదానిలో నడుగుఁడు. నేను సేవకుండనుగాను వీరుండను. లవంగి యను చిన్నది బలాత్కారముగా నాలయములోఁ బ్రవేశించునని యీద్వారము గాపాడుచుంటిని.

లవంగి — ఉచితంవా విప్రస్యవీరత్వం దయామయ హృదయస్య॥ దయాహృదయుం డగు బ్రాహ్మణునికిఁ బౌరుషము తగునా ?

వీరుఁడు - కోయం పరసురామః. పరశురాముఁ డెవ్వఁడు? బ్రాహ్మణుఁడు కాఁడా? అతం డెట్లు వీరుండయ్యెను.

అని యారీతి వారిరువురకు యుక్తిప్రయుక్తులుగా రెండు గడియలు శాస్త్రములయందును బురాణములయందును బ్రసంగము జరిగినది. అందు వీరుని మాటలే మిగిలియుండెను. అప్పుడు వీరుఁడు అయ్యా ! యిది పర్వదినము. ------పరులు పెక్కండ్రు వచ్చుచుందురు. మనప్రసంగము పెక్కండ్ర నిలఁబెట్టినది. ఇప్పుడు సమయము కాదు. వెండియు దర్శనమిత్తురేనిఁ బ్రసంగింతము. మీతో మాటాడుటకు