పుట:కాశీమజిలీకథలు -04.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

29]

గోవిందుడను బ్రహ్మచారి కథ

225

నిలిపి తిలకా ! తిలకా ! యని పిలువఁ దొడంగినది. ప్రతివచనంబు గానక గుఱ్ఱమును వెనుకకు మఱలించి నడుపుచు దిలకా ! యని పిలుచుచుఁ గొంతదూరము పోయినది. అయ్యో ! యెక్కుడు దూరము వెనుకకు వచ్చితి నాలోపలనే పడియుండను మఱల నాలాగే పోవలయునని పైకి నడిపించెను. ఈరీతి వెనుకనుండి ముందరకు ముందర నుండి వెనుకకుఁ దెల్లవారు వఱకుఁ పదిసారులు తిరిగినది. కాని తిలకజాడ గనఁబడినదికాదు. అంతలో సూర్యోదయ మైనది. ఆప్రదేశమంతయు మహారణ్యమైయున్నది. వచ్చినదారి యేదియో పోవలసినదారి యేదియో తెలియక లలిత సాధ్వసకలితమతియై విధిలేక వీతి నొక రీతి నడిపించుచు వృక్ష లతా గుల్మాంతరములఁ దిలకం దిలకింపు చుండెను. క్రమంబున ఖరకరుని వేడి కిరణంబులు సోకి వేడి జనింప శ్రమ జలబిందు సందోహంబు వదనంబునకు మకరంద బిందు సందీప్త మగు నరవిందంబుఁ చందంబొందుపరుపఁ ---ఱలసటతో నడచుచుండ నొకదండి శాఖామండలచ్చన్న దిక్తటం బగు పటవిటపి యొకటి గనంబడినది ఆ చెట్టునీడ గుఱ్ఱముదిగి యమ్మగువ నలుదెసలు దిలకింపుచుఁ దన మనంబున నిట్లు తలంచెను.

హా | పాడువిధీ ? నన్నిప్పుడు నట్టడివిలోఁ దీసికొనివచ్చి పాఱవేయుదువే ? అయ్యో ? కులకాంతా విరుద్దంబని తలంపక యెండమావుల జలంబులు గ్రోల నాసఁ గొనునట్లు వాని యుత్తరమునకు లేని యర్థములుదీసి లోకనింద్యురాలై యిట్టులనిల్లు వెడలివచ్చితినిగదా ! అన్నన్నా ! ఆ కోటగోడ యెట్లు దాటితినో తలంచుకొన నాకే విస్మయమగుచున్నది సీ ? ఆఁడుజాతి పాడుజాతిగదా ! కష్టపడి కన్న తల్లిదండ్రుల మక్కువ లెక్కింప కుల్లంబున వల్లభునెడ పక్షపాతముఁ జూపుదురు. ఆ ? యేమి నిజముగా నేనిల్లు వెడలి వచ్చితినా ? లేదు. లేదు. ఇదిస్వప్నము. అక్కటా ? ఇది కలగాదు నిజమే. హా ! తిలకా ! నీ యనురాగ మెట్లు మఱచిపోవుదును. నీమాట వినక ఘోటకమును వేగముగాఁ దొలఁబట్టి గదా నిన్నుఁ గోలుపోయితిని నాకు నీవెట్లు కనంబడుదువు. ఇప్పుడేమి చేయుదును ? ఎక్కడికిఁ బోవుదును ? రక్షించువా రెవ్వరు ? ప్రాణ సఖిం బోఁగొట్టికొంటి. పుష్పహాసుఁడు గనంబడుననుమాట దబ్బఱ అన్నిటికిఁ జెడిపోయితినని పలుదెఱంగుల జింతించుచు నాకలిబాధింప గర్తవ్యమేమియుతెలియక తిలక వచ్చునేమోయని నలుదెసలుం బరికింపుచుండెను.

గోవిందుడను బ్రహ్మచారికథ

ఆ ప్రాంతమందుఁ దామ్రపురంబను కాపుటూరుగలదు. అందుఁగల దు బౌరోహిత్యముఁ జేయుచు గోవిందుఁడను బ్రహ్మచారి యందుఁ గాపురముఁ జేయుచుండెను. వానికిఁ దల్లి మాత్రమే కన్నత. సచ. మంచు వచ్చిన - 113, 2 మనసుపడుచు నాకు . ఆమ్మ