పుట:కాశీమజిలీకథలు -04.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

అది వాని యొద్దనుండి తెచ్చినీకిచ్చిన వారెవ్వరని యడిగిన నేమియుం దోచక యాలోచింపుచున్నంత తిలక ఆయ్యా ! అది నేను దీసికొనిపోయి యిచ్చితిని. ఆమె మరచి పోయినదని సవరించినది. కానిండు మీ రందఱు స్వతంత్రులు. పయివాఁడను సందియము లేక పెద్దలు లేరని వెరవక యొరు లిచ్చిన వస్తువు లంతఃపురమునకుఁ దీసికొని వత్తురేమి ? రాజును రానీయుఁడు అని బెదరించుచు నతండు బాధ నభినయించుచు నా రాత్రి యెట్టకే గడపెను. పట్టణమంతయు నా రాత్రి పుష్పహాసుని మాటఁ జెప్పుకొనుచుండ విని యా రాత్రి గుహుఁడు కొడుకుం జేరి నాయనా ! యిదియేమి కర్మము ? నీవు రాజపుత్రుని గ్రుద్దితివఁట ఱేపు నీ పని యగునని ప్రజలు పందెములు వైచుకొను చున్నారు. ఏమి చేసితివి ? నిజము జెప్పుమన నతండు జరిగిన వృత్తాంత మంతయు నా మూలాగ్రముగాఁ జెప్పెను.

అప్పుడు వాఁడు నాలుకఁ గఱచుకొనుచు అయ్యో ! అయ్యో ! యెంతపని జేసితివిరా ! పడుచువాఁడవు అంతఃపురమునకుఁ బోవచ్చునా ! అన్నన్నా ! రాజు విన్న గమారునిఁ గొట్టిన దానికన్న డప్పుగా గటించునుగదరా ! బలవద్విరోధము వచ్చినదే. యేమి చేయుదుము ? మనల రక్షించువా రెవ్వరని యూరక విచారించినఁ బుష్పహాసుం డిట్ల నియె.

తండ్రీ ! యిందు నా తప్పు రవ్వంతైన లేదు. నే నంతఃపురమునకు రాననిన నది బలాత్కారముఁ జేసి తీసికొనిపోయినది. నన్నుఁ బోవలదని యడ్డు పెట్టిన వాని గ్రుద్దితిని. రాజు విమర్శింపక నన్నూరక శిక్షించునా ? అంత యధర్మ శీలుండా? పొనిమ్ము. వేగురం బరిమార్చినను వారికి నేను లోఁబడనని బీరములు పలికిన మందలింపుచు గుహుం డిట్ల నియె.

అప్పా ! యీ వార్త వినన రాజునకుఁ గోపము రాక మానదు. నిన్ను దండింపక విడువఁడు కావునం నీ విం దుండరాదు. యవన ద్వీపంబున కవ్వల నమరావతియను పట్టణము గలదు. మనయోడ లక్కడికిఁ బోవుచుండును. అది తీర స్థలము. అచ్చట నాకు మిత్రులున్నారు. వారికిఁ బత్రికలు వ్రాసి యిచ్చెదను. నీ వక్కడికిఁ బోయి కొన్ని దినంబులుండి రాజు కోపము చల్లారిన తరువాత రమ్ము. ఇదియే యుపాయమని చెప్పి వాఁడెట్టకేఁ బట్టి నొడంబడఁజేసి యా రాత్రి పయనముఁ జేసి వాని నంపెను. ధనంజయ నృపాలుం డమ్మఱనాఁడు. వేఁటనుండి వచ్చి సామంతుల వలన నా వృత్తాంత మంతయు నాలించి పుత్త్రునోదార్చుచు నప్పుడే పుష్పహాసునిం బట్టుకొని ఱెక్కలుగట్టి తీసికొని రండని కింకరుల కాజ్ఞాపించెను. పదుగురు వీరభటులు పోయి గహునియిల్లు ముట్టడించి వెదకి పుష్పహాసు నెందునఁ గానక గుహుం బట్టుకొని ఱేనికట్టెదుటికిం దీసికొని పోయి యా వృత్తాంతము జెప్పిన రాజువానితో –

ఓరీ ! బెస్తవాడా ! నీ కొడుకు పోతరించి యేమిచేసెనో చూచితివా ! విద్యలం గఱపించినందుల కిదియా ఫలము ? కానిమ్ము. వాని నెక్కడ దాచితివో