పుట:కాశీమజిలీకథలు -04.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

లలిత కథ

219

శుద్ధాంతకాంత లెల్లదల్లడమందుచు నా రాత్రి రాజవైద్యులు రప్పించి పలు విధములగు చికిత్సలు చేయించిరి. పుష్పహాసుఁ డారాజపుత్రుం బితృలోకము జూచి వచ్చునట్లు గ్రుద్ది పాఱిపోయి వచ్చెనను వార్త పట్టణమంతయు వ్యాపించినది. సామంతులు వేఁట నుండి తక్షణము రావలయునని నృపాలునకు వార్త నంపిరి.

అట్టుండ నది రాజపుత్రిక పుష్పహాసుం డడిగిన ------- తన ప్రమాదముఁ దెలిసికొని తిలకతో సఖీ ! యిప్పుడు రూపైక పక్షపాతి యగు నిందిరాసూతి నన్నంత తేలిక పఱచెనో చూచితివా ?అయ్యో ! సన్నంత తేలి: పు 1.5 1 ని .. " - 1 - in- సంతులని నలంద యే ముడు - అన్ వలం.. | మంతi. 3 time. 197: ను గా న న న నల దని చెప్పితి:- ను "" మన కుల ..... | Fi•vi in 1 .రు.. రు.19న సప్పుడు H యిట్ల సి. ఉచ్చి మన

మన మేమి వింతలు గనపరచితిమి ? వాఁడు కంకణముఁ దెచ్చి మనకిచ్చెను. మనము గై కొంటిమి. దీనం దప్పేమి ? అతండు స్వయముగా నీ చేతం బెట్టిన విశేష మొకటి జరిగినది. కళాదకులస్థు లట్లుపెట్టుట వాఁడుక యున్నది గదా ! ఇదియు నట్లే జరిగిన దని తలంచరాదా ? ఊరక పశ్చాత్తాప పడుచుంటి వేమని మందలించిన నా చంచలాక్షి వెండియు నిట్ల నియె.

అగునగు నంతకన్న క్రొత్తవింత లేమియు వ్యక్తిపరచలేదు. కాని వాని సోయగము తలంచుకొన మనమున నేదియో వికారము గలుగుచున్నది. వాని యందుఁ గల కొఱఁత యైనది గాని కానిచో నెవ్వరేమనుకున్నను వానినే పెండ్లి యాడితీఱుదు. కానిమ్ము. మన రహస్య మెవ్వరికిఁ దెలియ నీయకుమీ యని పలుకుచుండఁగనే పరిచారిక యొకతె వచ్చి అమ్మా ! అన్నయ్యగారి నెవ్వఁడో గుండెలమీఁద గ్రుద్దినాఁ డఁట. అంతఃపురములో మరణబాధ పడుచున్నారు. అమ్మ గారు మిమ్ముఁ దీసికొని రమ్మన్నారని నిట్టూర్పులు నిగుడింపుచు జెప్పిన గొబ్బున లేచి యేమేమీ ? మాయన్న బాధపడుచున్నాఁడా ? వాని గ్రుద్దినవాఁ డెవ్వఁడని మఱల నడిగిన నది ఆయనతోఁ జదువు కొన్న వాఁడట యెవ్వఁడో పుష్పహాసుఁడంట, వాఁడు గుద్దెనని చెప్పుకొనుచున్నారు. సత్వరము రమ్మని పలికిన విని తిలక మొగము చూచుచు సఖీ ! యిది యేమి వార్త ? దీన మనకేమైన ముప్పు రాదు గదా ? యని పలుకుచు లలిత తిలకతోఁ గూడ నన్నయున్న సౌధంబున కరిగినది.

అందుఁ గాంత లందఱు పుష్పహాసుండు స్వామి ద్రోహుఁడు. చదువు చెప్పించెనను విశ్వాసమైన లేక ప్రభు పుత్రుఁడని మన్నింపక యిట్లు చేయునా ? యా యూరక చెప్పుకొనుచున్నారు. ఆ మాటలు విని లలిత వెఱచుచు నన్నదగ్గఱకుఁ బోయి అన్నా ! సుందరక ! నీకు దెబ్బ తగిలినదా ? యని యడిగెను. వాఁడు కన్నులెత్తి చూచి ఆ పల్లె హలాంకోరు నీ యొద్దకు రెండవ కంకణము పంపెనట. నిజమేనా ? యని యడిగిన సప్పడఁతి తెల్ల బోవుచు మాటలు దడబడ బం పెఁ బంపె నని చెప్పినది