పుట:కాశీమజిలీకథలు -04.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లలిత కథ

215

దీసికొనిపోయి కృతజ్ఞతఁ జూపుచు విద్యాప్రదాన దక్షణగా నృపాలున కిచ్చిరమ్ము పొమ్మని పంచిన పుష్పహాసుం డొకనాఁడు సాయంకాలమునఁ జక్కగా నలంకరించుకొని యా కంకణముం బూని కోటలోనికి పోయెను. అప్పుడు కొల్వుకూటంబు వివక్తంబై యుండుట కచ్చెరువందుచుఁ గొంచె మవ్వలికిం జని మనుష్యులజాడ నరయుచుండ లలిత సఖురాలు తిలక యసు కలికి యచ్చటి కేమిటికో వచ్చినం జూచి బోఁటీ ! నేఁడు రాజసభయం దెవ్వరును లేరేమి ? ఒడయం డెందున్నాఁడని నది నరపతి వేఁటకై యడవికిం జనియె. దానం జేసి యోలగంబు శూన్యంబై యున్నదని చెప్పి నీ వెవ్వండవు ? ఏమిపనికై వచ్చితి ? వని యడిగినఁ బుష్పహాసుండు తన కులశీలనామంబు లెఱింగించి ఱేనికి వెనుక మేమొక కడియం బిచ్చితిమి. రెండవదికూడ దొరకుటచే నదియుం దెచ్చితి. దాని నిచ్చుటకై పరిపృధు నడిగితినని చెప్పెను.

ఆ మాట విని యా బోఁటి యోహో ! అదియా ? తెలిసినది. నిలు నిలు మది మా రాజపుత్రిక ధరించియున్నది. రెండవదానికొరకు వేడుకపడుచున్నది. ఆమెతోఁ జెప్పివచ్చెదనని పోయి యంతలో మఱలవచ్చి ఓయీ ! భర్తృదారిక నిన్నా కడియ మంతఃపురమునకుఁ దీసికొని రమ్మన్నది. వత్తువే యనుటయు నతండు సంశయించుచు నిప్పుడు రాను. ఱేఁడు వచ్చినతరువాత మఱలఁ దీసికొనివచ్చెద. పోయివత్తునని రెండడుగు లిడినఁ దిలక యడ్డము నిలిచి పోవలదు పోవలదు వెఱవకుము. మఱెవ్వరు నందులేరు. ఇమ్మండనంబు దాల్ప నమ్మగువ మిగుల వేడుక పడుచున్నది. పదపద మని త్రోసినది.

లలితకథ

అతం డడుగులు తడఁబడ నప్పడతివెంట మెల్లఁగాఁ గక్ష్యాంతరమ్ములు గడచి రాజపుత్రిక వసించియున్న శద్ధాంతమున కరిగెను. నాఁడు దైవికముగాఁ జెలికత్తియ లందఱు తల యొక పనిమీఁదం బోయిరి. లలిత యొక్కరితియే చంద్రకాంత శిలావేదికపయిం గూరుచుండి వీణాగాన పరిశ్రమ చేయుచున్నది. అప్పుడు తిలక వానిని ద్వారదేశమున నిలువంబెట్టి లోపలికిఁబోయి లలితా ! ఆ చిన్నవాఁడు వచ్చి యున్న వాఁడు; కడియము పుచ్చుకొననా ? వానినిఁ దీసికొని రానా ? యని యడిగిన సప్పడఁతి వాఁడేల ! కంకణమే తెమ్మనిచెప్పినది. తిలక యా వయసుకాని చెలువ మా లలనకుఁ జూపింపఁ దలచి పొలఁతీ ! య వెరవరి కడియము నా కీయఁ డట. తానే నీచేతఁ గూర్తుననుచున్నాఁ డేమనియెద ? వనఁ దద్వసులోభంబునంజేసి కానిమ్మి. పల్లెవాఁడుగదా ! రమ్మను మని పలికినది. అప్పడఁతి యప్పపుష్పహాసు నా విలాసిని చెంతకుం దీసికొనిపోయినది. అబ్బిబ్బోకవతి యబ్బురపాటుతో నా పల్లెవానింజూచి: అమ్మనేఁజెల్ల ? వీడెక్కడ పల్లెవాడే వీని రూపము త్రిభువనా సేచకంబై యున్నదిగదా ! యని విస్మయ సాగరంబున మునుఁగుచు నాత్మగతంబున_ .