పుట:కాశీమజిలీకథలు -04.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4]

లవంగికథ

25

వీరడిది. ఈయేల దిక్కులేని పీనుగులలాగు వంతు మంది. మంగలాయనిలో వీరడి వద్దకు పొమ్మని సెప్పు.

వెంకి - చెప్పినాను. వంతులు పనికిరావంట సివంగియేమో వూరుమీదబడి యల్లరి చేస్తుందంట వేగ రమ్మంటున్నాడు.

గంగడు - నే రాను పో ముండా యీమాటు లేపేవంటే బఱ్ఱపగలు కొట్టుతాను.

మంగలి - కానిమ్ము. తొంగో అదిగో బంట్రోతుగారు వస్తూన్నారులే.

వెంకి - బేగలెగు బేగలెగు బంట్రోతయ్యే వస్తూన్నాడంట.

బంట్రోతు – (ప్రవేశించి) తొత్తుకొడకా? యిక్కడ కూర్చున్నావేమి? నీవు వచ్చి యెంతసేపయినది. గంగడేడీ?

మంగ - అయ్యోబాబూ నన్నేమంటారు? గంగఁడిది వంతుకాదంట. తొంగుండి లెగకున్నాడు.

బంట్రోతు – లంబ్డీకొడకా? గంగా? వంతు నీదికాదా? యిటురా యేమన్నావూ?

గంగడు - లేదండి బాబు లేదు. వస్తున్నాను. (అని డప్పుతగిలించుకొని వచ్చుచున్నాడు.)

బంట్రోతు - వూఁ జాగ్రత్త. టము కేమని వేయవలయునో తెలుసునా?

గంగడు - తెలుసు యిన్నాను.

బం - ఈడే నేను వినుచుండగా నోకమాటు వేయి.

గం - చిత్తము. పాదుషాగారి సివంగిపిల్లవచ్చి వూరుమీఁదఁబడి గుడిలో దూరగలదు. యిప్పుడు పుసన్నపాడులో వున్నది. కాఁబట్టి గ్రామస్తులందఱు కత్తి కట్టుకొని సిద్దంగా ఉండండోయి.

బం - ( పక పక నవ్వుచు) వోరోయి! పాదుసాగారి సివంగి యేమిటిరా?

గం - ఏమో మంగలాయన నా కాలా సెప్పినాడు.

బం - సివంగి కాదు లవంగి.

గం - లంపంగంటె యేంటండి?

బం - ఆయన కూతుఁరు పేరు.

గం - ఆయన కూఁతురు మనవూరుమీఁదఁ బడడ మేటండి. అంత కొవ్వి యున్నదా యేమి.

బం - కాదురా సరిగా విను. పాదుషాగారి కూఁతురు లవంగి చిన్నది వచ్చి హుస్సేనుబాదుకోటలోఁ బ్రవేశించి యున్నది. ఈమె విశ్వేశ్వరుని