పుట:కాశీమజిలీకథలు -04.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కలభాషిణి కథ

203

గలభాషిణియైనఁ దీసిరేమో వారికి దాని వృత్తాంతముఁ జెప్పియుంటినికాదా. అని తలంచి సత్వరముగా దనగదిలోని కరిగి భార్యను దల్లిని నాచేతి కంకణము దీసిరా యని యడిగిన వారేమియు నెఱుఁగమని యుత్తరముఁ జెప్పిరి.

అప్పు డతం డేమియుం దోచక యున్మ త్తతతో హేమప్రభను గుఱించి పలుతెఱంగులఁ జింతించుచు సత్రము విడిచి సాయంకాలముదనుక నూరెల్ల గ్రుమ్మరుచు నుత్తరదిశకుం బోయిన నందు వాఁడు పండుకొన్న పాడుదేవాలయము గనంబడినది. చీఁకటిగా నున్నను వెరువక యుతండా కోవెల యావరణలోనికింబోయి నలుమూలలు విమర్శించుచున్నంత నా ప్రాంతమందు స్త్రీ పురుషుల సంవాద మిట్లు వినబడినది

స్త్రీ - బ్రాహ్మణుబ్రువుఁడా నా మనోహరుఁ డేడీ ? నన్నీ చీకటిలో నీ పాఁడుగుడికిం దీసికొని వచ్చితి వేమిటికి ?

పురు - కొమ్మా ! నీ మనోహరుండు పరలోకగతుం డయ్యెనని వింటి. ఆ మాట నీకు నుడువజాలక యిక్కడికిఁ దీసికొనివచ్చితిని.

స్త్రీ - ఏమంటివి ? మదీయ హృదయభాస్కరుండు భాస్కరుం డస్తమించెనా ? హా ! మనోహరా ! హా ! సుగుణాకర ! హా ! దయాసాగర ! వెంటనే వత్తునని చెప్పిపోయితివే ? ఇంత యక్కటికము లేకపోవలయునా ? అయ్యో ? నీ యనురాగ మెట్లు మఱచిపోదును. నీవుపోయిన లోకమొద్దియో చెప్పుము. సత్వరమున వచ్చి కలసికొందును అని విచారింపఁ జొచ్చినది.

పురు - నారీమణీ ! ఊరక వగచెదవేల ? వగపున చచ్చినవారు వత్తురా ? ఊరడిల్లు మూరడిల్లుము.

స్త్రీ - ఏమిచూచుకొని యూరడిల్లెదను ? నాకు గతి యెద్ది ? కర్తవ్య మేమి ?

పురు – నేనుండ నీకుఁ గొఱంతయేల ? నన్నుఁ జూచుకొనియే ధైర్యము వహించి యుండుము. నీకుఁ గతి నేనే.

స్త్రీ - నీ వలన నాకుఁ బ్రయోజనమేమి ?

పురు - నీకేమి కావలయునో యదియెల్ల నేను సవరించగలను. నాకంటె నతం డధికుండనుకొంటివా యేమి ?

స్త్రీ - (కనులెఱ్ఱఁజేసి) పాపాత్మా ? ఏమి సవరింతువు ?

పురు - నీకేది యభీష్టమో యదియే.

స్త్రీ - దుఃఖార్తురాల నగుట నింతవఱకు సైరించితిని. ప్రల్లదము లాడకుము.