పుట:కాశీమజిలీకథలు -04.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

202

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

బ్రా - చంద్రగుప్తుఁడు మొదట నల్లుని జూచినప్పుడే వరహీనమని సమ్మతింపఁలేదట. పిమ్మట నట్టు జరిగినకదా ? వరహీన కారణము నిరూపించి యందలి నష్టమీయనని చంద్రగుప్తుఁడు ప్రత్యుత్తర మొసంగెను తన్మూలమున నిరువురకు విరోధము జనించినది.

విదే - తరువాత తరువాత ?

బ్రా - తరువాత నా విరోధము ప్రబలుటచేఁ జతురంగబలములతో నిరువురకు గొప్ప యుద్ధము జరిగినది.

విదే - (నవ్వుచు) పెండ్లికూతురు పారిపోయినను వీరి కలహము లడఁగ లేదా ? తుదకెవ్వరు గెల్చిరి ?

బ్రా - చంద్రగుప్తుడు గీర్తికేతుని సంగరరంగమున నోడించి సపుత్రకముగ బంధీగృహంబునం బెట్టించి యతని రాజ్యము లాగికొనియెను.

విదే - సాధు సాధు. సాధుజనుల బాధించిన పాప మూరక పోవునా ? పిమ్మట ?

బ్రా - పిమ్మట నేమి యున్నది. ఆ రాజ్యమునకు జంద్రగుప్తుడే ప్రభు వయ్యెను. కావున మా యగ్రహారములకు విధించిన పన్నులు దీసివేయుమని ప్రార్ధించుటకై వచ్చితి నిదియే వృత్తాంతము.

విదే - అన్నన్నా ! విక్రమార్కుని రాజ్యమున కెన్ని పాట్లు వచ్చినవి. అతని పుణ్యమైనను గాచినది కాదే ? కపుత్రునిచేఁ గులమిట్లే చెడిపోవును. అని మాటలాడికొనిరి.

ఆ సంవాదమంతయు భాస్కరుడు విని విస్మయ చింతాసంతాపములు స్వాంత ముత్తలపెట్ట అయ్యో ? మా తండ్రిని తమ్ముని జెఱబెట్టినఁ జంద్రగుప్తుఁడు నాకు శత్రుఁడుగాక మిత్రుఁడా ? అదియునుంగాక నేనిప్పు డతనియొద్ద కల్లుండనై పోయి బాంధవ్యంబుజూపిన ననుమోదించునా ? కలభాషిణిని మఱియొక ------ దలంచియె యుండును. నాకంతయేల వచ్చినది ? అతండే నా యొద్దకువచ్చి బ్రతిమాలుకొనునట్లు చేయునుచితము. నాకు జంద్రావలోకుండను యశస్కరుండు యుద్దమున దోడ్పదురు. కాకున్నను మదీయ బాహుబలంబున నీ రాజు పీచమడుప లేనా? అని తలంచుచు స్మరణమబినయించుకొని ఆహా నా ప్రియురాలు హేమప్రభ మాట మఱచిపోయితిగదా ! అందు రాక్ష---- లున్నవి. వీరిపాలిటి రక్కసి నాలు. అన్నా : అన్నా శీక . దనతో వండినే పత్తనున్న మలనిజాయితి. నేను గృతఘ్నుం. అచ్చటి న స ... - (1 : At : తెలిసినది. కంకణ ప్రభావమునఁ కదా.

ఇంత మఱపు వచ్చినదేమి ? (చేతులు తడువుకొనుచు) అయ్యో ఆ కంకణ మేమైపోయినది. యెప్పుడు పోయినదో జ్ఞాపకము లేదేమి ? పాపము మా తల్లియైనఁ .