పుట:కాశీమజిలీకథలు -04.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

26]

కలభాషిణి కథ

201

విదేశీ - హరహరా ! యెంత దారుణము? ఎంత దారుణము ? తరువాత ?

బ్రా -- తరువాత వానికిఁ దగిన ప్రాయశ్చిత్త మైనది లెండి. దైవము లేఁడా యేమి?

విదేశీ - ఎట్టెట్టు వక్కాణింపుము.

బ్రా - వినుండు. పిమ్మట నతండు దుష్కులప్రసూత యగు నొకజాతిం బెండ్లి యాడి యందాత్మ సదృశుండగు పుత్రు నొక్కని గనియెను.

విదేశీ - తరువాత ?

బ్రా - ఈ పట్టణరాజు తన పుత్రిక కలభాషిణిని నిత్తునని శుభపత్రికలు వ్రాయింపగాఁ గుమారుండు చిన్నవాఁడైనను రాజ్యరోధంబునంజేసి నమ్మించి సపుత్రకముగా నచ్చటికిఁ దరలివచ్చెను.

విదేశీ - ఆ రాజునకు బురుష సంతానము లేదా యేమి ?

బ్రా - లేదు లేదు. ఆ చిన్నది యొక్కరితియే.

విదే - తరువాత ?

బ్రా - ఆ కలభాషిణి యేమికారణముననో శుభముహూర్తమునకుఁ బూర్వమే యెక్కడికో వెళ్ళిపోయినదఁట.

విదేశీ - కారణమేమి ?

బ్రా – అందులకుఁ గారణమా ? స్త్రీల చర్యలు మీరెరుంగనివా యేమి ? మనవాఁడే యొక బ్రాహ్మణ కుమారుడు దాసీముఖముగా సంబంధము గలుపుకొని లేవనెత్తికొని పోయెను. స్త్రీలకుఁ బరపురుష సంగముకన్న నానందము మఱియొకటి లేదుగదా ?

మఱియొకఁడు - ఛీ ! ఛీ ! మూర్ఖా ! వాడాదోషములేలఁ గట్టికొనియెదవు ? కలభాషిణి మహాపతివ్రత. సావిత్రియుంబోలె మొదట నిశ్చయించిన పతి మృతుం డయ్యెనని విని విచారింపుచుఁ దండ్రి పునర్వివాహముఁ జేయుటకు నిశ్చయింపగాఁ నంగీకరింపక విరక్తితో వెళ్ళినది. ఇదియే నిజము.

ఒకఁడు - చాలు చాలు. నీ వేమి యెరుంగుదువు ? వాని పేరు మదనకేతనుఁడు. వాఁడు నాతోఁ జెప్పియే యరిగెను. వానికొఱకు వాని వారలు విచారింపు చున్నారు చూచిరమ్ము.

విదేశీ - పోనిండు ఎట్లయిన మననేమి. తరువాత నేమిజరిగినది ?

బ్రా -- కుమారి పరారి యయ్యెనని చింతింపుచుండఁ జంద్రగుప్తునియొద్దకుఁ గీర్తికేతుండు దనకైన పయనపురొక్కమిచ్చు కొమ్మని వార్తనంపెను.

విదే -- కుమారుండు బెండ్లికూతురుకన్న జాల చిన్న - స ముతించిన ప్రతులు వర్థం . . . . .