పుట:కాశీమజిలీకథలు -04.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

పూఁబోణియు సమయోచితములగు పలుకులచే నాచెలువకు ధైర్యముగలుగఁ జేసినది. రాజపుత్రుండు తదీయ సతీత్వధర్మమునకును వివేకమునకును మిక్కిలి సంతసించెను. మఱియు నిప్పుడు తన్నెఱింగించినను గపటమే యనుకొనునని తలంచి మాఱుమాటాడక శ్రీశైలమున కరుగుచుఁ గొన్నిపయనములు వారి ననుసరించియే సాఁగించెను. ఒకచోఁ గాళులు పొక్కులెక్కి వెతఁజెందుచు నడువలేక నడుచు చున్నయొక వృద్ధురాలిం జూచి యతండు జాలిపడి యామెకుఁ జేయూతయిచ్చి మెల్లగాఁ నడిపించుచుఁ దీసికొనిపోయెను. దానంజేసి తుదముట్ట వారితోఁబోవుటకు వీలుపడినది కాదు.

విజయభాస్కరుండు శ్రీశైలమునకరిగి మహాశివరాత్రినాఁడు పాతాళగంగా ప్రవాహంబునఁ దీర్థంబులాడి మల్లికార్డున లింగమునభిషేకాద్యర్చనలఁ గావించి తాఁ దెచ్చిన రత్నములన్నియు నందుఁ గోటితీర్దప్రాంతమందలి మంటపంలోఁ గూర్చుండి సద్గోష్ఠిఁజేయుచున్న పరివ్రాజకబృందమునకుఁ బంచిపెట్టి వారియొద్దఁ గూర్చుండి సాయంకాలము వఱకుఁ దదీయసంభాషణామృతముఁ గ్రోలి శ్రోత్రానందముఁగావించు కొనియెను. ఆ కూటములో ధర్మములకెల్ల నేధర్మముత్తమమని యొకఁడు ప్రశ్న వేయఁ బరోపకారము భీతరక్షణము పరమోత్తమధర్మములని యందఱు నేకగ్రీవముగా బలికిరి. అధర్మమును గుఱించియే పెద్దతడవు వితర్కింపుచు ననేకపురాణేతిహాసముల నుపన్యసించుచుండిరి. అట్టి సమయంబునఁ గోటితీర్థమున గుభాలుమను చప్పు డొకటి వినంబడినది. తోడనే ఆహా ! యెవ్వరో దీనిలోఁబడినారు. పడినారను ధ్వని నలుమూలల వ్యాపించినది ఆ రోద విని యావిరక్తులందఱు తటాలున లేచి యా బావి యొద్దకుఁ బోయి దుర్జన హృదయంబు వోలెఁ దయోమయంబైయున్న యా నూఁతిలోనికి దొంగిచూడఁ దొడంగిరి. అప్పు డారాజపుత్రుండు వడివడి జనుదెంచి (మరణ మకాలమునరాదు మహినెవ్వకిన్) అను మునుపటి పద్యమును జదువుచు యోగులెల్ల వెఱఁగంది చూచుచుండ గభాలున నయ్యంధకారకూపంబున నుఱికి యందు మునిగి యున్న దేహిం బట్టుకొని నీఁటి పైకిఁ దేలించెను.

అంతలో మఱి కొందఱు పుణ్యాత్ములు త్రాళ్ళువైచుకొని దిగి వారిరువురిని బైకిఁదీసిరి. అప్పుడందుఁ బడినది యొక జోగురాలుగా దెలిసికొని తద్విరక్తి కందఱు వెరఁగు పడఁ జొచ్చిరి. అప్పుడా జోగురాలు కన్నులం దెఱచి హాపుత్రా ! హా భాస్కరా ? హా గుణనిధీ | హా దయాళూ ! నీవనిన ట్లకాలమున మరణమురాదుగదా? అయ్యో ! తండ్రీ ! నీవు పరలోకగతుండ వైతివని వినియు నీ కృపణప్రాణములు నన్ను వీడకున్నవి. నేను బ్రతికి యేమిచేయుదును ? నాకు దిక్కెవ్వరు ? సార్థకమేమి యని యూరక విలపింపఁజొచ్చినది.

ఆ పరివేదనము విని యందొక విరక్తుండు. ముందరికి వచ్చి అమ్మా ! నీవు భాస్కరుని తల్లి వని తెలిసికొంటిని. అప్పుణ్యాత్మునిఁ జంపించిన ద్రోహిని నేనే