పుట:కాశీమజిలీకథలు -04.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

194

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

దేమో తెలియదు. ఇప్పటికైన నా మాట నమ్మెదవా ? యనుటయు నతండు నవ్వుచుఁ గాముకుల స్వభావ మిట్లేయుండును. నా మాటలు నీ మది కెక్కునా ? నీ యిష్టము వచ్చినట్లు కానిమ్ము. నాకు నిద్రవచ్చుచున్నది. నేను పోయివత్తునని పలికి యతం డరిగెను.

మదనకేతనుండును మఱికొంతసేపుండి యింటికి పోయెను. రాజపుత్రుఁడా సంవాద మంతయువిని కలభాషిణి యనఁ దాను దొంగలవలన నిడిపించిన చిన్నదిగా నిశ్చయించి అయ్యారే ? యా బాలికను బ్రాహ్మణ పుత్రునకుం బెండ్లి చేయునట్ల నిరూపించితినే ? అది యేటికిఁ దప్పినది. నా వృత్తాంతమెట్లు తెలిసినది. మఱియొకనిం బెండ్లియాడక యోగినియై పారిపోవనేల? చిత్రముగా నున్నది. యీ విటుని వలపు విన యేమిచేయునో చూచెదంగాక యని పూవుఁబోడి యెఱింగించిన గ్రామముల పేరు జ్ఞాపకముంచుకొని యా మార్గముల వెంబడిఁ బయనము సాగించుచు నాలుగు దినములకు వారి గలిసికొనియెను.

పూవుఁబోడి మదనకేతునితో మాటాడుచుండ వారేయని గ్రహించి యతండు వెనువెంట దూరముగా నడచుచుండెను. రాజుపుత్రుండు తపంబున కుద్యమించు పార్వతియుంబోలె జటావల్కలములఁ దాల్చి కనకమణిభూషాంబరముల నూడ్చియున్న యా చిన్న దానిని జూచి నాలుగైదు సంవత్సరములై నది. అప్పుడీ యొప్పులకుప్ప సమాక్రాంత యౌవన యగుచున్నది. ఇప్పుడు సమారూఢయౌవనయై యున్నది. ఆహా ! యీ మోహనాంగి జటావల్కలములఁ దాలిచినను మనోహరము గానే యున్నదిగదా ! స్వభావసుందరులకు వికృతియుఁ గ్రొత్తయందమును దెచ్చునని చెప్పినమాట యదార్ధమగును. ఈ బాలిక శీలమును బరీక్షించుట యావశ్యకమై యున్నదని దలంచుచు మఱికొన్ని పయనములు సాగించెను.

మదనకేతనుఁడు నవసర మరసి వారితోఁ పోపుచుండెను. ఒకనాఁడు కలభాషిణి పూవుబోఁడీ ! యీ చిన్నవాఁ డెవ్వఁడు? తఱచు నీవు మాటాడుచుంటివి. నీ వెఱింగిన వాఁడాయేమి? మన వెనువెంటఁ దిరుగుచున్నవాఁడేల ? యని యడిగిన నది యువతీ ! యితండు బ్రాహ్మణ కుమారుఁడు శ్రీశైలమునకుఁ పోవుచున్నాడట. దారిలోనే పరియచమైనది. మంచివాడు మనకు సహాయముగా నుండునని మాటలాడు చుంటినని యుత్తరముఁ జెప్పినది. అతండును నక్కవినయములు చూపుచుఁ గొంత కొంత పరిచయము గలుగఁజేసికొని మాటల--- జొచ్చుచుఁ బురాణగాదల వినుపింపుచుఁ దోడ నడచుచుండెను.

ఒకనాఁడు రాత్రి శ్రీశైల ప్రాంత కాంతారములో వసించి యున్నప్పుడు మదనకేతనుండు పూవుఁబోడి నెద్దియో మిషచే దాపున లేకుండుటజేసి ధరతో రాణశిష్టం వచ్చి ప్రస్తాకంగా నోరు అప్పటించు కొంటిని ఎగుము. యౌవనము చంద్రం పూరయావనములో