పుట:కాశీమజిలీకథలు -04.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

192

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

వెండియు నిచ్చటికి రాఁ దలంపుగలిగినప్పు డీ కంకణమును జేత నిడికొని తలంచుకొని యే తటాకంబున మునింగిస నిచ్చటికి వత్తువు. ఇదియే సాంకేతికము. ఈకంకణము నేమఱ వద్దు సుమీ ? మీ తల్లిం జూచి వారములోపున రాకున్నఁ జింతిల్లు దాన దీన బంధుండవు నీ వెఱుంగనిది లేదని యతనిచే నొప్పించుకొని మోము ముద్దు గొనుచు భూలోక గమనంబున కనుజ్ఞ యిచ్చినది.

అతండు కొన్ని రత్నములు మూట గట్టుకొని యా కాసారమున మునింగి శోభావతీ పురంబున కరుగునట్లు తలంచుకొని లేచి చూచినంత నప్పట్టణము కన్నుల పండువు గావించినది. అప్పుడు హేమప్రభా ప్రభావంబు వేతెఱంగుల గొనియాడుచు నల్లన నప్పుట భేదనము లోనికిం జని యశస్కరుని గుఱించి వితర్కింపఁ దన్నుఁ గుఱించి పశ్చాత్తాపముం జెందుచు విరక్తుండై తీర్ధాటనము సేయ నరిగినట్లు తెలిసినది. పిమ్మటఁ దన బసలోనికిం బోయి తల్లిం జీరిన నామెయుఁ బుత్రశోక వ్యాకులచిత్తయై యెందేనిం బోయినట్లు వినఁబడినది. అప్పుడా రాజపుత్రుఁడు మిక్కిలి విచారింపుచు వారి జాడ నరయు తలంపుతో ననేక జనపదంబులు తిరిగి తిరిగి యొకనాఁడు సాయంకాలమునకుఁ గలభాషిణి యున్న చంద్రప్రస్థ పురంబునకుం బోయి యొక దేవాలయములోఁ బండుకొని ధ్యానింపుచుండెను.

కలభాషిణికథ

అంతలో నొకస్త్రీ వచ్చి యతని వీఁపు తట్టుచు మదనకేతనా ! లెమ్ము లెమ్ము. రాజపుత్రికను గోట దాటించి వచ్చితివి మేము పయనమై శ్రీ శైలమునకుం బోవుచుంటిమి. నీవు మమ్ము ముందరి మజిలీలోఁ గలిసికొనుము. కార్యసంఘటనముఁ జేయుటకు నేనుపూట నా కిత్తునన్న పారితోషిపముఁ దీసికొని రావలయుం జుమీ. పోవుచున్నదాన. నిలువ వీలులేదు. కలభాషిణి నొక్కరితను నిలువం బెట్టి వచ్చితినని పలుకుచు నా యువతి యరిగినది. భాస్కరుఁ డామాట లన్నియు విని వెఱగందుచు నోహో ! ఇది యెవ్వతెయో ? నన్ను జూచి మదనకేతనా, యని పిలుచుచు నేమో ముచ్చటించినది. పాపము వీరికెద్దియో సాంకేతిక మున్నది కాఁబోలు. రాజపుత్రికను గోట దాటించి వచ్చితినని చెప్పినది. ఇది జారకృత్యము కావచ్చును. లోకమున నెన్ని వింతలైన నున్నవి కదా ! యని యూహింపుచు నక్కడనే పండుకొని యుండెను.

అప్పుడు మఱియొక తరుణుఁ డా ప్రాంతమందుఁ దిరుగుచు ------- వయస్యా ! యా దాసీరండమాట విని యీ యర్ధరాత్రమున నీపాడు దేవాలయములో వచ్చి మోసపోయితిమి. పాదరక్షలైన లేవు. ఈ గడ్డిలో నేపామైన గ-------------- వాన జీరఁగలదు. పోవుదము రమ్ము ఇఁకరాదు. ప్రొద్దుపోయినది. ---------------- రాజుపుత్రికకు వివాహ మహాత్సవ యెల్లుండి జరుగునని గ్రామమంతయు ----------- పుచున్నారే. నీవు దాని మాట యెట్లునమ్మితి వనుటయు, నాతండు మిత్రమా